Varun Tej Lavanya Tripathi
Varun Tej Lavanya Tripathi : మెగా హీరో వరుణ్ తేజ్ – హీరోయిన్ లావణ్య త్రిపాఠి 2023 లో పెళ్లి చేసుకోగా ఇటీవలే లావణ్య త్రిపాఠి పండంటి బాబుకి జన్మనించ్చినట్టు ప్రకటించారు. దీంతో మెగా ఫ్యామిలీలో సందడి నెలకొంది. రెండు రోజుల క్రితమే ఈ బాబుకి బారసాల ఫంక్షన్ కేవలం కుటుంబ సభ్యుల మధ్యే జరిగింది.
తాజాగా వరుణ్ తేజ్ – లావణ్య తమ కొడుకు పేరుని ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ప్రకటిస్తూ బారసాల ఫోటోలను కూడా షర్ చేసారు. వరుణ్ తేజ్ లావణ్య తమ బాబు పేరుని వాయువ్ తేజ్ కొణిదెల అని ప్రకటించారు. దీంతో పలువురు సెలబ్రిటీలు, ఫ్యాన్స్ వాయువ్ తేజ్ కి బ్లెస్సింగ్స్ తెలుపుతున్నారు.