Varun lavanya : వరుణ్ లావణ్య పెళ్లి ముహూర్తం.. ఏ రోజు ఎన్ని గంటలకు..? ఫుల్ డీటెయిల్స్..

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఇటలీలోని(Italy) టుస్కానీ నగరంలో పెళ్లి చేసుకోబోతున్నారు. ఇప్పటికే మెగా, అల్లు, కామినేని, లావణ్య ఫ్యామిలీలు, పలువురు సన్నిహితులు ఇటలీకి చేరుకొని సందడి చేస్తున్నారు.

Varun Tej Lavanya Tripathi Marriage Venue Date and Muhurtham Full Details

Varun lavanya : మెగా హీరో వరుణ్ తేజ్(Varun Tej), హీరోయిన్ లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) ఆరేళ్లుగా సీక్రెట్ గా ప్రేమించుకొని ఇటీవల నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ ఇండియాలో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ చేసుకున్న జంట ఇప్పుడు ఇటలీలో వివాహం చేసుకోబోతున్నారు.

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఇటలీలోని(Italy) టుస్కానీ నగరంలో పెళ్లి చేసుకోబోతున్నారు. ఇప్పటికే మెగా, అల్లు, కామినేని, లావణ్య ఫ్యామిలీలు, పలువురు సన్నిహితులు ఇటలీకి చేరుకొని సందడి చేస్తున్నారు. నాలుగు రోజుల పాటు ఈ పెళ్లి వేడుకలు జరగనున్నట్టు తెలుస్తుంది.

నిన్న అక్టోబర్ 30 రాత్రి సంగీత్ పార్టీ చేసుకున్నారు.
నేడు అక్టోబర్ 31 ఉదయం హల్దీ వేడుకలు, సాయంత్రం మెహందీ వేడుక నిర్వహించనున్నారు.
నవంబర్ 1న మధ్యాహ్నం 2 గంటల 48 నిమిషాల ముహూర్తంకు వరుణ్ లావణ్య ఒక్కటవ్వనున్నారు.
నవంబర్ 1 రాత్రి అక్కడే రిసెప్షన్ కూడా నిర్వహించనున్నారు.

Also Read : Nithin : వరుణ్ లావణ్య పెళ్ళికి బస్సు వేసుకొని మరీ వెళ్తున్న నితిన్ ఫ్యామిలీ..

అనంతరం ఇటలీ నుంచి హైదరాబాద్ కి తిరిగి వచ్చాక నవంబర్ 5న ఇక్కడ రిసెప్షన్ నిర్వహించనున్నారు. ఈ రిసెప్షన్ కి సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, మెగా అభిమానులు హాజరవ్వనున్నారు. ఇక సోషల్ మీడియాలో వరుణ్ లావణ్య పెళ్లికి సంబంధించిన ఫొటోలు ఏం వచ్చినా వైరల్ అవుతున్నాయి. అభిమానులు, పలువురు ప్రముఖులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.