VarunLav : వరుణ్, లావణ్య పెళ్ళి వీడియోలు.. పవన్ కళ్యాణ్ ఫోటోలు కూడా..

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్ళికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.

Varun Tej Lavanya Tripathi marriage videos viral

VarunLav : ఇటలీలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ప్రేమ బంధంతో ప్రయాణం మొదలుపెట్టి పెళ్లి బంధంతో ఒకటయ్యారు. గత మూడు రోజులు నుంచి సంగీత్, కాక్ టైల్, హల్దీ, మెహందీ వేడుకలతో సందడిగా జరుగుతున్న ఈ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో మెగా కుటుంబం సందడి చేస్తుంది. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట లీక్ అవుతుండగా.. అవి వైరల్ అవుతున్నాయి. పెళ్ళికి సంబంధించిన ఫోటోలు ఇంకా బయటకి రాలేదు.

అయితే పెళ్లి మండపం, వరుణ్ తేజ్ మండపానికి వచ్చే వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఒక కారులో వరుణ్ ని మండపం దగ్గరకు తీసుకు వచ్చారు. వీటితో పాటు విందు భోజనాలు ఏర్పాట్లకు సంబంధించిన వీడియోని కూడా ఉపాసన షేర్ చేశారు. ఇక సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ పోస్టులను చూసిన అభిమానులు.. విషెస్ తెలియజేస్తున్నారు. మరో పక్క పవన్ ఫ్యాన్స్.. పవన్ కి సంబంధించిన ఒక ఫోటో రిలీజ్ చేయండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. వారి ఎదురు చూపులు కూడా ఫలించాయి. పవన్ ఫోటోలు వచ్చాయి. అయితే పవన్ బ్యాక్ సైడ్ మాత్రమే కనిపిస్తున్నాయి.

Also read : Pawan Kalyan : వరుణ్ లావణ్యల పెళ్లి.. పవన్‌ పై వచ్చే మీమ్స్ చూస్తే నవ్వకుండా ఉండలేరు..

ఈ పెళ్లి అనంతరం రాత్రికి అక్కడే రిసెప్షన్ కూడా నిర్వహించనున్నారు. ఇటలీ నుంచి హైదరాబాద్ కి తిరిగి వచ్చాక నవంబర్ 5న ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఇండస్ట్రీ పర్సన్స్ కోసం ఇక్కడ కూడా ఒక రిసెప్షన్ నిర్వహించనున్నారు. ఈ రిసెప్షన్ హైదరాబాద్ లోని ఎన్ కన్వెన్షన్ హాల్ లో జరగనుంది.