Varun Lavanya : వరుణ్ లావణ్య పెళ్లి వేడుకల షెడ్యూల్ ఇదే.. ఏ రోజు ఏ కార్యక్రమం అంటే?

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఇటలీలోని(Italy) టుస్కానీ నగరంలో పెళ్లి చేసుకోబోతున్నారు. ఇప్పటికే మెగా ఫ్యామిలీ కూడా ఇటలీ చేరుకుంది.

Varun Tej Lavanya Tripathi Wedding Schedule in Italy

Varun Lavanya : మెగా హీరో వరుణ్ తేజ్(Varun Tej), హీరోయిన్ లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) ఆరేళ్లుగా సీక్రెట్ గా ప్రేమించుకొని ఇటీవల నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మెగా ఇంట పెళ్లి వేడుక సంబరాలు మొదలయ్యాయి. ఆల్రెడీ ఇండియాలో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ చేసుకున్న జంట ఇప్పుడు ఇటలీలో వివాహం చేసుకోబోతున్నారు.

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఇటలీలోని(Italy) టుస్కానీ నగరంలో పెళ్లి చేసుకోబోతున్నారు. ఇప్పటికే మెగా ఫ్యామిలీ కూడా ఇటలీ చేరుకుంది. కేవలం రెండు ఫ్యామిలీల సమక్షంలో మాత్రమే వీరి పెళ్లి డెస్టినేషన్ వెడ్డింగ్ లా జరగనున్నట్టు సమాచారం. నాలుగు రోజుల పాటు ఈ పెళ్లి వేడుకలు జరగనున్నట్టు తెలుస్తుంది.

అక్టోబర్ 30 రాత్రి సంగీత్ పార్టీ చేసుకోనున్నారు.
అక్టోబర్ 31 ఉదయం హల్దీ వేడుకలు, సాయంత్రం మెహందీ వేడుక నిర్వహించనున్నారు.
నవంబర్ 1న పెళ్లి వేడుక జరగనుంది.
అనంతరం ఇటలీ నుంచి హైదరాబాద్ కి తిరిగి వచ్చాక నవంబర్ 5న ఇక్కడ రిసెప్షన్ నిర్వహించనున్నారు. ఈ రిసెప్షన్ కి సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, మెగా అభిమానులు హాజరవ్వనున్నారు.

Also Read : Vishwak Sen : విశ్వక్‌సేన్ సంచలన ట్వీట్.. బ్యాక్ గ్రౌండ్ లేకపోతే ప్రతి నా కొడుకు.. సినిమా రిలీజ్ అవ్వకపోతే ప్రమోషన్స్‌కి రాను..

ఇక వరుణ్, లావణ్య ఇటలీ చేరుకొని అక్కడ ఎంజాయ్ చేస్తూ, ఫోటోలు దిగుతూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.