Operation Valentine Teaser : ఇండియా గాంధీదే కాదు.. బోస్‌ది కూడా.. ఆపరేషన్ వాలెంటైన్ టీజర్ అదుర్స్..

వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్ టీజర్ వచ్చేసింది. మన దేశం గాంధీజీతో పాటు సుభాష్ చంద్రబోస్‌ది కూడా..

Varun Tej Manushi Chhillar Operation Valentine teaser released

Operation Valentine Teaser : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కొత్త దర్శకుడు శక్తి ప్రతాప్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా ‘ఆపరేషన్ వాలెంటైన్’. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ మూవీలో మిస్ వరల్డ్ మానుషీ చిల్లర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. వరుణ్, మానుషీ జెట్ ఫైటర్స్ గా కనిపించబోతున్నారు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరిలో రిలీజ్ చేయనున్నారు. తాజాగా నేడు ఈ మూవీ టీజర్ ని రిలీజ్ చేశారు.

కంప్లీట్ యాక్షన్ కట్ తో టీజర్ అదిరిపోయింది. ఇక టీజర్ చెప్పిన ఒక డైలాగ్ అయితే అందర్నీ ఆకట్టుకుంటుంది. “శత్రువులకు ఒక విషయం గుర్తు చేయాల్సిన అవసరం వచ్చింది. మన దేశం గాంధీజీతో పాటు సుభాష్ చంద్రబోస్‌ది కూడా” అనే డైలాగ్ చెబుతూ యుద్దానికి సిద్దమవుతున్న సైనికుడిగా వరుణ్ వావ్ అనిపించారు. ఈ టీజర్ తో మూవీ పై మంచి అంచనాలు క్రియేట్ చేశారు.

Also read : Salaar Trailer : సలార్ రిలీజ్ ట్రైలర్ చూశారా..? బాబోయ్ యాక్షన్ అదిరిపోయిందిగా..