Varun Tej : పెళ్ళికి ముందే గుమ్మడికాయ కొట్టేసిన వరుణ్.. ఇక ఇటలీకి ప్రయాణమే..

ఇటీవల గాండీవధరి అర్జున అనే సినిమాతో వచ్చినా అది ఆశించినంత ఫలితం ఇవ్వలేదు. త్వరలో ఆపరేషన్ వాలెంటైన్(Operation Valentine)అనే మరో కొత్త కాన్సెప్ట్ తో రాబోతున్నాడు వరుణ్.

Varun Tej Operation Valentine Movie Shoot Completed

Varun Tej : మెగా హీరో వరుణ్ తేజ్ త్వరలో హీరోయిన్ లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi)ని పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ గ్రాండ్ గా చేసుకున్న వరుణ్ త్వరలోనే ఇటలీలో లావణ్యని వివాహం చేసుకోబోతున్నాడు. ఇక సినిమాల పరంగా వరుణ్ మొదటి నుంచి కూడా జయాపజయాలతో సంబంధం లేకుండా ప్రయోగాలు చేస్తూనే ఉన్నాడు.

ఇటీవల గాండీవధరి అర్జున అనే సినిమాతో వచ్చినా అది ఆశించినంత ఫలితం ఇవ్వలేదు. త్వరలో ఆపరేషన్ వాలెంటైన్(Operation Valentine)అనే మరో కొత్త కాన్సెప్ట్ తో రాబోతున్నాడు వరుణ్. కొత్త దర్శకుడు శక్తి ప్రతాప్ దర్శకత్వంలో వరుణ్, మానుషీ చిల్లర్ జంటగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో ఆపరేషన్ వాలెంటైన్ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమాని డిసెంబర్ 8న రిలీజ్ చేస్తామని ప్రకటించారు.

Also Read : Trisha Krishnan : సెకండ్ ఇన్నింగ్స్‌లో త్రిష కూడా బోల్డ్ సీన్స్‌కి రెడీ అవుతుందా? లియో సినిమాలో విజయ్‌తో లిప్ కిస్..

తాజాగా ఈ సినిమా షూటింగ్ ని పూర్తి చేశారు. నేడు ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి గుమ్మడికాయ కొట్టారు. షూటింగ్ పూర్తయిన విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించారు. దీంతో పెళ్ళికి ముందే చేతిలో ఉన్న పనులు అన్ని పూర్తి చేసేశాడు వరుణ్. ఇక వీరి పెళ్లి ఇటలీలో నవంబర్ ఫస్ట్ వీక్ లో జరుగుతుందని సమాచారం. దీంతో త్వల్లో వరుణ్ ఫ్యామిలీతో కలిసి ఇటలీకి బయలుదేరనున్నాడు. పెళ్లి తర్వాత కొన్ని నెలలు గ్యాప్ తీసుకొని ఆ తర్వాతే నెక్స్ట్ సినిమా మొదలుపెడతాడని సమాచారం.