వాల్మీకి, తమిళ్‌లో సూపర్ హిట్ అయిన జిగర్తండా మూవీకి అఫీషియల్ రీమేక్.
మెగాప్రిన్స్ వరుణ్ తేజ్, హరీష్ శంకర్ డైరెక్షన్‌లో ఒక సినిమా తెరకెక్కబోతుంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై, రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్న ఈ సినిమాకి, వాల్మీకి అనే టైటిల్‌ని ఫిక్స్ చేసి, పూజా కార్యక్రమాలతో సినిమాని లాంఛనంగా ప్రారంభించారు. ముహూర్తపు సన్నివేశానికి మెగా డాటర్ నిహారిక, వరుణ్ తేజ్‌పై క్లాప్ నివ్వగా, రామ్ బొబ్బ కెమెరా స్విచ్చాన్ చేసారు. వి.వి.వినాయక్ గౌరవ దర్శకత్వం వహించారు. సుకుమార్, దిల్ రాజు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వాల్మీకి, తమిళ్‌లో సూపర్ హిట్ అయిన జిగర్తండా మూవీకి అఫీషియల్ రీమేక్. ఈ సినిమాకి సంబంధించి వరుణ్ టెస్ట్ షూట్ కూడా కంప్లీట్ అయ్యింది.
ప్రస్తుతం నటీనటుల, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతుంది. త్వరలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాబోతున్న వాల్మీకి సినిమాకి కథ : కార్తీక్ సబ్బరాజ్, స్ర్కీన్ ప్లే : మధు, చైతన్య, కెమెరా : అయానంక బోస్, సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఎడిటింగ్ : చోటా కె.ప్రసాద్. ఆర్ట్ : అవినాష్ కొల్ల, ఫైట్స్ : రామ్-లక్ష్మణ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : హరీష్ కట్టా.