Bangarraju: వాసివాడి తస్సదియ్యా టీజర్.. చిట్టితో అక్కినేని హీరోల అల్లరి డాన్స్!

కింగ్ నాగార్జున ఆయన తనయుడు అక్కినేని నాగ చైతన్య కలిసి నటిస్తున్న లేటెస్ట్ మూవీ బంగార్రాజు. ఎన్నో అవాంతరాల తర్వాత మళ్ళీ సెట్స్ మీదకి వచ్చిన ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

Bangarraju

Bangarraju: కింగ్ నాగార్జున ఆయన తనయుడు అక్కినేని నాగ చైతన్య కలిసి నటిస్తున్న లేటెస్ట్ మూవీ బంగార్రాజు. ఎన్నో అవాంతరాల తర్వాత మళ్ళీ సెట్స్ మీదకి వచ్చిన ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. యంగ్ డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహించగా 2019లో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన సినిమా సోగ్గాడే చిన్ని నాయనాకు సీక్వెల్‌గా ఈ బంగార్రాజు తెరకెక్కుతోంది. దర్శకుడు కూడా కళ్యాణ్ కృష్ణే. సోగ్గాడే చిన్ని నాయనాలో ఉన్న సీనియర్ రమ్యకృష్ణ ఈ సినిమాలోనూ నాగార్జునకు జోడీగా నటిస్తోంది.

Sai Pallavi: ఒక్కటే పీస్.. తెలుగు తెరపై హైబ్రీడ్ పర్ఫామెన్స్!

బంగార్రాజుతో నాగ చైతన్యకి జోడీగా కృతిశెట్టి జతకట్టింది. ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన టీజర్స్, లుక్స్ అక్కినేని అభిమానులను ఎంతగానో ఆకట్టుకోగా విడుదల చేసిన లిరికల్ సాంగ్స్ కు మంచి అప్లాజ్ దక్కింది. కాగా ఇప్పుడు ఈ చిత్రం నుండి మరొక లిరికల్ సాంగ్ విడుదలకి సిద్దం అయింది. ఈ సినిమా నుండి వాసివాడి తస్సాదియ్యా టీజర్ రిలీజ్ అయింది. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈసినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దింపేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

Rashi Khanna: బెల్లీ అందాలతో గిలిగింతలు పెట్టేస్తున్న ఢిల్లీ భామ!

కాగా.. తాజాగా విడుదలైన వాసివాడి తస్సదియ్యా టీజర్ ను బట్టి చూస్తే ఈ పాటలో ఫరియా అబ్దుల్లాతో అక్కినేని తండ్రి కొడుకులు అల్లరి డాన్స్ ఇరగదీసినట్లుగా కనిపిస్తుంది. గీతామాధురి పాడిన ఈ పాట తెలుగు సినిమాలలో మరో ఐటెం నెంబర్ గా సూపర్ రెస్పాన్స్ దక్కించుకోడం ఖాయంగా కనిపిస్తుంది. సోగ్గాడే చిన్నినాయనాలో మాదిరి బంగార్రాజులో కూడా నాగార్జున పాత్రను రొమాంటిక్ గా తీర్చిదిద్దినట్లు కనిపిస్తుంది. ఆదివారం సాయంత్రం 5:05 నిమిషాలకు ఈ వాసివాడి తస్సాదియ్యా పాట విడుదల కానుంది.