Vedhika : భయపెట్టడానికి రెడీ అవుతున్న వేదిక.. ‘ఫియర్’ అంటూ..

వేదిక మెయిన్ లీడ్ లో సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో ‘ఫియర్’ అనే సినిమాని తెరకెక్కించారు.

Vedhika Movie Fear First Look Released by Prabhudheva

Vedhika : తెలుగులో ముని, విజయదశమి, బాణం, కాంచన.. లాంటి పలు సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది వేదిక. సౌత్ లో తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో సినిమాలు చేస్తున్న వేదిక అయిదేళ్ల తర్వాత మెయిన్ లీడ్ లో తెలుగులో మళ్ళీ ఎంట్రీ ఇస్తుంది. వేదిక మెయిన్ లీడ్ లో సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో ‘ఫియర్’ అనే సినిమాని తెరకెక్కించారు.

Also Read : Jr NTR : క్యాన్స‌ర్‌తో పోరాడుతున్న అభిమాని.. వీడియో కాల్ మాట్లాడిన ఎన్టీఆర్‌

తాజాగా నేడు ఫియర్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను స్టార్ డైరెక్టర్, కొరియోగ్రాఫర్ ప్రభుదేవా రిలీజ్ చేసారు. ఈ పోస్టర్ చూస్తుంటే ఒక చీకటి గదిలో హీరోయిన్ భయపడుతూ కూర్చుంది. త్వరలోనే ఫియర్ సినిమా థియేట్రికల్ రిలీజ్ కానుంది.

దత్తాత్రేయ మీడియా బ్యానర్ పై ఏఆర్ అభి నిర్మాణంలో హరిత గోగినేని దర్శకత్వంలో ఈ ఫియర్ సినిమాని నిర్మించారు. ఈ సినిమాలో నటుడు అరవింద్ కృష్ణ స్పెషల్ రోల్ చేయగా పవిత్ర లొకేష్, అనీష్ కురువిల్ల, షాయాజీ షిండే, సత్య కృష్ణ, సాహితి దాసరి, షాని.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు. ఇప్పటికే ఫియర్ సినిమా పూర్తయి పలు ఫిలిం ఫెస్టివల్స్ కి కూడా పంపించి దాదాపు 60 అవార్డులు గెలుచుకుంది.