Jr NTR : క్యాన్సర్‌తో పోరాడుతున్న అభిమాని.. వీడియో కాల్ మాట్లాడిన ఎన్టీఆర్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర చిత్రంలో నటిస్తున్నాడు.

JR NTR Video Call to his fan suffering with cancer
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే.. దేవర మూవీ చూసే వరకు అయినా తనను బ్రతికించండి అని క్యాన్సర్‌తో బాధపడుతున్న ఓ ఎన్టీఆర్ అభిమాని మాట్లాడిన వీడియో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఈ వీడియో ఎన్టీఆర్ వరకు చేరింది. వెంటనే స్పందించిన ఎన్టీఆర్ సదరు అభిమానితో వీడియో కాల్ మాట్లాడాడు.
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కౌశిక్(19) 2022 నుంచి బ్లడ్ క్యాన్సర్‌తో పోరాడుతున్నాడు. అతడు ఎన్టీఆర్‌కు వీరాభిమాని. బెంగళూరులోని కిడ్‌వై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇటీవల అతడి తల్లిదండ్రులు తిరుపతిలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తమ కుమారుడు కౌశిక్‌కు చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్ అంటే ఎంతో ఇష్టం అని చెప్పారు. అతడు బోన్ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడని, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని తెలిపారు. సెప్టెంబర్ 27న దేవర సినిమా విడుదల అవుతుండడంతో ఆ సినిమా చూసేంత వరకు అయినా తనను బ్రతికించాలని డాక్టర్లను వేడుకుంటున్నాడని, అతడి చివరి కోరిక అని చెబుతూ కన్నీటి పర్యంతమయ్యారు.
Megha Akash : పెళ్లి పనులు మొదలుపెట్టిన హీరోయిన్.. ఘనంగా మెహందీ వేడుక..
వైద్యానికి రూ.60లక్షల ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పారని, ప్రభుత్వం, దాతలు ఆదుకోవాలని కోరారు. ఇక ఈ విషయం ఎన్టీఆర్ వరకు వెళ్లింది. తన అభిమాన సంఘం నేతల ద్వారా కౌశిక్‌తో ఎన్టీఆర్ వీడియో కాల్ మాట్లాడాడు. ఈ క్రమంలో నవ్వు నవ్వుతుంటే బాగున్నావు అని ఎన్టీఆర్ అనగా మిమ్మల్ని ఇలా చూస్తానని అని అనుకోలేదని కౌశిక్ అన్నాడు. ఎలా ఉన్నావని ఎన్టీఆర్ ప్రశ్నించగా బాగున్నానని సమాధానం ఇచ్చాడు.
కౌశిక్ క్యాన్సర్‌ను జయించాలని ఎన్టీఆర్ ఆకాంక్షించారు. ముందు ఆరోగ్యం అని ఆ తరువాతే సినిమా ఇంకా మిగిలినవన్ని అని ఎన్టీఆర్ అన్నారు. త్వరలోనే కలుస్తానని మాట ఇచ్చారు. కౌశిక్ అమ్మతో మాట్లాడుతూ.. ధైర్యంగా ఉండాలని సూచించారు. మీరు ధైర్యంగా ఉంటేనే మీ అబ్బాయి ధైర్యంగా ఉంటాడని, అందరం ఉన్నామని ఎన్టీఆర్ భరోసాను ఇచ్చారు.
NTR – Sandeep Reddy Vanga : సందీప్ రెడ్డి వంగతో ‘దేవర’.. స్పెషల్ ఇంటర్వ్యూ ప్రోమో చూశారా?
A Great Gesture From @tarak9999 Anna.❤️👏#JrNTR‘s Heartwarming Video Call with Tirupathi Fan Kaushik and Family. pic.twitter.com/JFMEXzQd77
— Sampath Kumar 🚁 (@AlwaysSampath99) September 14, 2024