Veekshanam Movie Unit Arranged Thankyou Meet
Veekshanam : రామ్ కార్తీక్, కశ్వి హీరో, హీరోయిన్‌లుగా తెరకెక్కిన ‘వీక్షణం’ సినిమా ఇటీవల అక్టోబర్ 18న రిలీజయింది. పద్మనాభ సినీ ఆర్ట్స్ బ్యానర్‌పై పి. పద్మనాభ రెడ్డి, అశోక్ రెడ్డి నిర్మాణంలో మనోజ్ పల్లేటి దర్శకత్వంలో కామెడీ మిస్టరీ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కింది. మర్డర్ మిస్టరీతో పాటు ఓ మంచి మెసేజ్ ఇచ్చి థియేటర్స్ లో ప్రేక్షకులను థ్రిల్ చేసి ఈ సినిమా మెప్పించింది. తాజాగా ఈ మూవీ యూనిట్ థ్యాంక్స్ మీట్ నిర్వహించారు.
Also See : Katrina Kaif : ఫ్యామిలీతో కలిసి కత్రినా కైఫ్ కర్వా చౌత్ వేడుకలు.. ఫొటోలు చూశారా..?
ఈ ఈవెంట్లో డైరెక్టర్ మనోజ్ పల్లేటి మాట్లాడుతూ.. ఈ సినిమా సక్సెస్ అవుతుందని ముందే తెలుసు. ఈ సక్సెస్ చూసి సంతోషంగా ఉంది. ప్రీమియర్ షోలు పడ్డప్పట్నుంచే పాజిటివ్ రెస్పాన్స్ చెప్తున్నారు. థియేటర్స్ లో చూసి ఈ సినిమాని సక్సెస్ చేస్తున్న అందరికి ధన్యవాదాలు అని తెలిపారు. హీరో రామ్ కార్తీక్ మాట్లాడుతూ.. మా సినిమాను జనాల్లోకి తీసుకెళ్లిన మీడియా వాళ్లకు, సినిమాను చూసి ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. అన్నిచోట్లా చాలా పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. నేను నిన్న కొన్ని థియేటర్స్‌కి వెళ్లాను. అక్కడ కూడా ప్రేక్షకులు పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తున్నారు అని తెలిపారు.
నటుడు శ్రీరామ్ మాట్లాడుతూ.. ఇది నా ఫస్ట్ సినిమా. నా మొదటి సినిమాకే ఇంత ప్రేమ దొరకడం చాలా సంతోషం. నాకు ఈ పాత్ర ఇచ్చిన డైరెక్టర్ మనోజ్ అన్నకు ఋణపడి ఉంటాను. నాకు సంతోషంలో ఏం మాట్లాడాలో తెలియట్లేదు అందరికి థ్యాంక్స్ అని అన్నారు. నటుడు శ్రీనివాస్ మాట్లాడుతూ.. సినిమాలో కామెడీ అంతలా బాగా రావడానికి నాతో కలిసి వర్క్ చేసిన ఫణి కారణం. ఇద్దరం పోటీ పడి నటించాం. నా ఫస్ట్ సినిమా అయినా నాకు బాగా సపోర్ట్ ఇచ్చారు అని తెలిపారు.