Veerabhimani
Veerabhimani : సీనియర్ సినీ జర్నలిస్ట్, నిర్మాత సురేష్ కొండేటి మెయిన్ లీడ్ లో తెరకెక్కిన సినిమా ‘వీరాభిమాని’. ఎస్‍కే రహ్మాన్, కంద సాంబశివరావు నిర్మాణంలో రాంబాబు దోమకొండ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. అజయ్ ఘోష్, అక్సా ఖాన్, అన్నపూర్ణమ్మ, ఎస్‍కే రహ్మాన్.. పలువురు కీలక పాత్రల్లో నటించారు. నేడు ఆగస్టు 22 మెగాస్టార్ చిరంజీవి 70వ పుట్టినరోజు సందర్భంగా ఈ వీరాభిమాని సినిమా థియేటర్స్ లో రిలీజయింది.(Veerabhimani)
కథ విషయానికొస్తే.. అంజి(సురేష్ కొండేటి)ఓ డ్యాన్స్ మాస్టర్. తన నానమ్మ(అన్నపూర్ణమ్మ)టీవీలో ప్రవచనాలు చెప్తుంది. ఎన్టీఆర్, వైఎస్సార్, అబ్దుల్ కలాం.. లాంటి గొప్ప గొప్ప వాళ్లంతా మరణించారు అనే ఓ ప్రోగ్రాం చూసి పుట్టిన మనిషి కచ్చితంగా చనిపోవాల్సిందేనా, ఎప్పటికి బతికి ఉండాలంటే ఏం చేయాలి అని తెగ మధనపడుతూ దాని కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు.
ఈ క్రమంలో అంజి నానమ్మ యమలోకంలో చిత్రగుప్తుని దగ్గర మన జీవితాలు రాసి ఉంటాయి ఓ బుక్ లో అని చెప్తుంది. దీంతో అంజి సూసైడ్ చేసుకొని యమలోకానికి వెళ్లి అక్కడ చిత్రగుప్తుని(ఎస్‍కే రహ్మాన్) బుక్ లో తన అభిమాన హీరో చిరంజీవి పేజీ చింపి తినేస్తాడు. యముడు(అజయ్ ఘోష్) ఆగ్రహించి ఎందుకు చేసావు అని అడిగితే.. మా హీరో భూమి ఉన్నంత కాలం బతకాలి అందుకే అంటాడు. ఇది విని యముడు ఏం చేసాడు? నిజంగానే చావు లేకుండా ఉంటుందా? అంజి మళ్ళీ బతికాడా తెలియాలి అంటే తెరపై చూడాల్సిందే..
Also Read : Bun Butter Jam : ‘బన్ బటర్ జామ్’ మూవీ రివ్యూ.. లవ్ స్టోరీలు.. నవ్వులతో పాటు ఎమోషన్ కూడా..
సురేష్ కొండేటి జర్నలిస్ట్ గా, నిర్మాతగా, ప్రెస్ మీట్స్ లో బాగా వైరల్ అయ్యాడు. సురేష్ కొండేటి మొదట్నుంచి మెగాస్టార్ కి వీరాభిమాని అని తెలిసిందే. సురేష్ తో పాటు, డైరెక్టర్, నిర్మాతలు.. అందరూ చిరంజీవి ఫ్యాన్స్ కలిసి ఈ సినిమా తీయడం గమనార్హం. ఈ సినిమా నిడివి కేవలం 40 నిమిషాలే కావడం ప్లస్. పైగా ఈ సినిమాని చిరు పుట్టిన రోజు ఆగస్టు 22 అంటే నేడు ఏపీ, తెలంగాణలోని 70 థియేటర్స్ లో మెగా అభిమానులకు ఫ్రీగా షో వేస్తున్నారు.
తమ ఫేవరేట్ హీరో చిరంజీవి ఎప్పటికి జీవించాలి ఉండాలి అనే కొత్త కాన్సెప్ట్ తో చిరంజీవి వీరాభిమానులు ఈ సినిమా తీయడం గమనార్హం. సినిమా సాంకేతికంగా ఇంకాస్త బెటర్ గా తీసి ఉండాల్సింది. మధ్యలో ఎన్టీఆర్, వైఎస్సార్, అబుల్ కలాం.. లాంటి వాళ్ళ గురించి చెప్పడం, చివర్లో చిరంజీవి గురించి చెప్పడం.. ఇదంతా కాస్త డాక్యుమెంటరీలా అనిపిస్తుంది. అంజి పాత్ర డ్యాన్స్ మాస్టర్ గా ఎస్టాబ్లిష్ లేకపోయినా కథని నడిపించొచ్చు. క్లైమాక్స్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కి లింక్ పెట్టుకొని రాయడం బాగుంది. సినిమాటోగ్రఫీ విజువల్స్ కూడా కొన్ని సీన్స్ లో ఇంకాస్త బెటర్ గా ఉండాల్సింది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా యావరేజ్. ఒక పాట అయితే బాగుంది.
Also Read : Soothravakyam : ‘సూత్ర వాక్యం’ మూవీ రివ్యూ.. మలయాళం మర్డర్ మిస్టరీ తెలుగులో..
నటీనటుల పర్ఫార్మెన్స్.. ఈ సినిమాకు అజయ్ ఘోష్ చాలా ప్లస్ అయ్యారు. యముడి పాత్రలో అజయ్ ఘోష్ అదరగొట్టేసారు. గతంలో పలు సినిమాల్లో నటించిన సురేష్ కొండేటి చాన్నాళ్ళకి మళ్ళీ ఈ సినిమాలో నటించాడు. అంజి పాత్రలో సురేష్ కొండేటి పర్వాలేదనిపించారు. అక్సా ఖాన్, అన్నపూర్ణమ్మ, ఎస్‍కే రహ్మాన్.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో ఓకే అనిపిస్తారు.
మొత్తంగా ‘వీరాభిమాని’ సినిమా సాంకేతికంగా పట్టించుకోకపోతే కథ పరంగా చిరంజీవి వీరాభిమానులకే..
గమనిక : ఈ సినిమా రివ్యూ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.