సినిమా షూటింగ్‌ల‌కు బ్రేక్..! వెహికల్ ఓనర్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం ..

మా వేతనాలు, వెహికల్ రెంట్ లు పెంచేంత వరకు ఈ బంద్ కొనసాగిస్తామని వెహికల్ ఓనర్స్ అసోసియేషన్ చైర్మన్ విజయ్ కుమార్, ప్రెసిడెంట్ హనీఫ్ తెలిపారు.

Tollywood Movies Shooting

Tollywood Movies Shooting : టాలీవుడ్ లో సినిమాల షూటింగ్స్ కు బ్రేక్ పడే అవకాశం కనిపిస్తుంది. సమ్మె సైరన్ మోగింది. సినిమా షూటింగ్ లకు వెహికల్స్ ను వెహికల్ ఓనర్స్ అసోసియేషన్ నిలిపివేసింది. తమ వేతనాలు, వెహికల్ రెంట్ లు పెంచేంత వరకు బంద్ చేస్తామని తెలుగు సినిమా అండ్ టీవీ వెహికల్ ఓనర్స్ అసోసియేషన్ తెలిపింది. వెంటనే తమ సమస్యలను పరిష్కరించాలని వెహికల్ ఓనర్స్ అసోసియేషన్ చైర్మన్ విజయ్ కుమార్, ప్రెసిడెంట్ హనీఫ్ కోరారు.

Also Read : Sai Dharam Tej : మా మామయ్య ఎమ్మెల్యే కాదు.. సాయి ధరమ్ తేజ్ ఆసక్తికర పోస్ట్..

గతంలో నిర్మాతల మండలికి మా సమస్యలను విన్నవించినా పరిష్కారం కాలేదని హనీఫ్ పేర్కొన్నారు. ఈరోజు లేదా రేపు నిర్మాతల మండలితో చర్చలు ఉంటాయని, మా వేతనాలు, వెహికల్ రెంట్ లు పెంచేంత వరకు ఈ బంద్ కొనసాగిస్తామని తెలిపారు. 16 సంవత్సరాల నుంచి సినీ పరిశ్రమలో ఉన్నాం. దాదాపు తొమ్మిది వందల వెహికిల్స్ మా అసోసియేషన్ లో ఉన్నాయి.. అసోసియేషన్ లో 1200 మంది ఓనర్లు సభ్యులుగా ఉన్నారని చెప్పారు.