Sai Dharam Tej : మా మామయ్య ఎమ్మెల్యే కాదు.. సాయి ధరమ్ తేజ్ ఆసక్తికర పోస్ట్..

నిన్న పవన్ గెలుపుతో సాయి ధరమ్ తేజ్ ఆనందం చూసి ఓ నెటిజన్..

Sai Dharam Tej : మా మామయ్య ఎమ్మెల్యే కాదు.. సాయి ధరమ్ తేజ్ ఆసక్తికర పోస్ట్..

Sai Dharam Tej Counter to A netzen Meme on AP Elections Results

Updated On : June 5, 2024 / 12:50 PM IST

Sai Dharam Tej : ఏపీలో కూటమి భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో పిఠాపురంలో గెలవడమే కాక జనసేన తరపున నిల్చున్న 21 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. దీంతో జనసేన పార్టీ, కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పవన్ విజయాన్ని మెగా అభిమానులతో పాటు మెగా ఫ్యామిలీ కూడా సెలబ్రేట్ చేసుకుంటుంది.

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నిన్న పవన్ ఇంటికి వెళ్లి, పవన్ ని ఎత్తుకొని గాల్లోకి తిప్పి మరీ తన సంతోషం వ్యక్తపరిచాడు. అయితే ఇటీవల పలువురు అభిమానులు సరదాగా పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అంటూ పోస్టులు చేయడం, పోస్టర్స్ వేయడం చేస్తున్నారు. నిన్న పవన్ గెలుపుతో సాయి ధరమ్ తేజ్ ఆనందం చూసి ఓ నెటిజన్.. పిఠాపురం ఎమ్మెల్యే గారి మేనల్లుడు తాలూకా అంటూ సరదాగా ఓ వీడియో మీమ్ తేజ్ ఫేస్ తో చేసి పోస్ట్ చేసారు.

Also Read : Renu Desai : కంగ్రాట్స్ అన్నయ్య.. అంటూ ఆ ఎమ్మెల్యేపై రేణుదేశాయ్ పోస్ట్..

సాయి ధరమ్ తేజ్ ఈ సరదా మీమ్ కి రిప్లై ఇస్తూ.. మా మామయ్య ఎమ్మెల్యే కాదు. మీ ఎమ్మెల్యే. మీ అందరికి శిరసు వంచి కోటి దండాలు అంటూ సరదాగా రిప్లై ఇచ్చాడు దీంతో సాయి ధరమ్ తేజ్ ట్వీట్ వైరల్ గా మారింది. సాయి ధరమ్ తేజ్ లో ఉన్న కామెడీ సెన్స్ కి నెటిజన్లు మరిన్ని కామెంట్స్ చేస్తున్నారు.