×
Ad

Venkatesh-Trivikram : వెంకటేష్‌-త్రివిక్ర‌మ్ సినిమా టైటిల్ ఇదే.. ‘ఆదర్శ కుటుంబం’.. హౌస్ నెం 47, ఏకే 47..

మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో విక్ట‌రీ వెంక‌టేష్ హీరోగా (Venkatesh-Trivikram )కొద్ది రోజుల క్రితం ఓ చిత్రాన్ని అనౌన్స్ చేసిన సంగ‌తి తెలిసిందే.

Venkatesh and Trivikram movie title is Aadarsa Kutumbam

Venkatesh-Trivikram : మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో విక్ట‌రీ వెంక‌టేష్ హీరోగా కొద్ది రోజుల క్రితం ఓ చిత్రాన్ని అనౌన్స్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్ర టైటిల్ ఇదే అంటూ సోష‌ల్ మీడియాలో ప‌లు పేర్లు ప్ర‌చారం అయ్యాయి. వాటి అన్నింటిని ప‌టా పంచ‌లు చేస్తూ తాజాగా ఈ చిత్ర టైటిల్‌ను ప్ర‌క‌టించారు. ఈ చిత్రానికి ‘ఆద‌ర్శ కుటుంబం’ అనే పేరును ఫిక్స్ చేశారు. ఈ మేరకు ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు.

ఈ పోస్ట‌ర్‌లో వెంక‌టేష్ బ్యాగ్ ప‌ట్టుకుని న‌వ్వుతూ క‌నిపిస్తున్నాడు. ఇక ఈ టైటిల్ లోనే హౌస్ నెం 47, ఏకే 47 అంటూ కూడా హైలెట్ చేయ‌డం గ‌మ‌నార్హం. ఈ రోజు నుంచే రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుండగా.. వ‌చ్చే ఏడాది వేస‌విలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయ‌నున్న‌ట్లు  చెప్పేశారు. ప్ర‌స్తుతం ఈ పోస్ట‌ర్ వైర‌ల్ అవుతోంది.

Nayanam Trailer : ఆసక్తికరంగా ‘నయనం’ ట్రైలర్‌..

శ్రీనిధి శెట్టి క‌థానాయిక‌ గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతకంపై ఎస్. రాధాకృష్ణ(చినబాబు) ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. గ‌తంలో వెంకీ, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో (Venkatesh-Trivikram) వ‌చ్చిన ‘మ‌ల్లీశ్వ‌రీ’, ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమాలు ఘ‌న విజ‌యాల‌ను సాధించ‌డంతో తాజా చిత్రంపై ప్రేక్ష‌కుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి.