అలాద్దీన్‌లో వెంకీ, వరుణ్..

త్వరలో రిలీజ్ కానున్న హాలీవుడ్ క్రీజీయెస్ట్ మూవీ అలాద్దిన్ కోసం.. వెంకీ, వరుణ్ తెలుగులో డబ్బింగ్ చెప్పారు. జీనీ పాత్రకు వెంకటేష్, అలాద్దిన్ పాత్రకు వరుణ్ తేజ్ డబ్బింగ్ చెప్పడం విశేషం.

  • Publish Date - April 26, 2019 / 06:20 AM IST

త్వరలో రిలీజ్ కానున్న హాలీవుడ్ క్రీజీయెస్ట్ మూవీ అలాద్దిన్ కోసం.. వెంకీ, వరుణ్ తెలుగులో డబ్బింగ్ చెప్పారు. జీనీ పాత్రకు వెంకటేష్, అలాద్దిన్ పాత్రకు వరుణ్ తేజ్ డబ్బింగ్ చెప్పడం విశేషం.

ఈ సంక్రాంతికి తోడల్లుళ్ళుగా ‘ఎఫ్ 2’తో బాక్సాఫీస్ దగ్గర సందడి చేసిన విక్టరీ వెంకటేష్, మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ కలిసి, మరోసారి వెండితెరపై సందడి చెయ్యబోతున్నారు. అదేంటీ, వీళ్ళిద్దరూ కలిసి సినిమా ఏం చెయ్యట్లేదు కదా.. దేని గురించి చెప్పేది అని కన్‌ఫ్యూజ్ అవుతున్నారా? మరేంలేదు.. త్వరలో రిలీజ్ కానున్న హాలీవుడ్ క్రీజీయెస్ట్ మూవీ అలాద్దిన్ కోసం.. వెంకీ, వరుణ్ తెలుగులో డబ్బింగ్ చెప్పారు. జీనీ పాత్రకు వెంకటేష్, అలాద్దిన్ పాత్రకు వరుణ్ తేజ్ డబ్బింగ్ చెప్పడం విశేషం. రీసెంట్‌గా రిలీజ్ చేసిన అలాద్దిన్ తెలుగు ట్రైలర్‌లో వీళ్ళిద్దరి వాయిస్‌లు చక్కగా సెట్ అయ్యాయి.

ఇంతకుముందు జగపతి బాబు.. ‘ది బి.ఎఫ్.జి’. సినిమాలో మెయిన్ క్యారెక్టర్‌కి డబ్బింగ్ చెప్పగా, మెగాస్టార్ చిరంజీవి ‘జై హనుమాన్’ అనే యానిమేషన్ మూవీలో హనుమాన్ క్యారెక్టర్‌కి డబ్బింగ్ చెప్పాడు. అవెంజర్స్ కోసం భల్లాలదేవ దగ్గుబాటి రానా డబ్బింగ్ చెప్పిన సంగతి తెలిసిందే.  విల్ స్మిత్, మెనా మసూద్, నయోమి స్కాట్ మెయిన్ లీడ్స్‌గా నటించిన అలాద్దిన్ మే 24న ప్రపంచ వ్యాప్తంగా రిలీజవుతుంది.

వాచ్, అలాద్దీన్ తెలుగు ట్రైలర్..