Balakrishna – Venkatesh : బాలయ్య బాబుతో వెంకీమామ సందడి.. పండక్కి అన్‌స్టాపబుల్ మాములుగా ఉండదు..

ఈసారి వెంకీమామ రాబోతున్నట్టు ఆహా ఓటీటీ తాజాగా ప్రకటించింది.

Venkatesh Coming to AHA Balakrishna Unstoppable Show

Balakrishna – Venkatesh : ఆహా ఓటీటీలో బాలకృష్ణ అన్‌స్టాపబుల్ సీజన్ 4 దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ సీజన్ లో ఇప్పటికే ఆరు ఎపిసోడ్స్ వచ్చి ప్రేక్షకులను ఫుల్ ఎంటర్టైన్ చేసాయి. ఏడో ఎపిసోడ్ కి కాస్త గ్యాప్ ఇచ్చినా ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో రాబోతుంది. ఏడో ఎపిసోడ్ లో ఈసారి వెంకీమామ రాబోతున్నట్టు ఆహా ఓటీటీ తాజాగా ప్రకటించింది.

Also Read : Game Changer : చరణ్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. అమెరికాలో ఫస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ‘గేమ్ ఛేంజర్’..

ఆహా ఓటీటీ బాలయ్య, వెంకటేష్ AI జనరేటెడ్ ఫొటోలతో పాటు ఓ ఒరిజినల్ ఫోటో షేర్ చేసి.. వెంకీమామ, బాలయ్య ఒకే స్టేజి మీద. ఎప్పుడూ చూడనటువంటి ఎంటర్టైన్మెంట్ ఎపిసోడ్ కి రెడీ అవ్వండమ్మా అంటూ పోస్ట్ చేసింది. దీంతో అన్‌స్టాపబుల్ సంక్రాంతి స్పెషల్ ఎపిసోడ్ కి వెంకటేష్ రానున్నట్టు తెలుస్తుంది. ఇటీవల వెంకటేష్, బాలకృష్ణ బయట పలుమార్లు కలిసి సందడి చేసారు, ఫ్యాన్స్ కి మంచి ట్రీట్ ఇచ్చారు. ఇప్పుడు ఇద్దరూ కలిసి షోలో కనపడబోతుండటంతో ఇరు హీరోల ఫ్యాన్స్ తో పాటు సినిమా లవర్స్ ఈ ఎపిసోడ్ కోసం ఎదురుచూస్తున్నారు. త్వరలోనే ఈ ఎపిసోడ్ షూటింగ్ జరగనుందని సమాచారం.

వెంకటేష్ సంక్రాంతి పండక్కి సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో రాబోతుండటంతో పనిలో పని ఆ సినిమా ప్రమోషన్ కూడా అన్‌స్టాపబుల్ లో అయిపోతుంది. సరదాగా మాట్లాడే వెంకీమామ – బాలయ్య కలిసి ప్రేక్షకులకు ఎలాంటి ఎంటర్టైన్మెంట్ ఇస్తారో చూడాలి.