Game Changer : చరణ్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. అమెరికాలో ఫస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ‘గేమ్ ఛేంజర్’..

చరణ్ కి అమెరికాలో వెల్కమ్ చెప్పడానికి వచ్చిన ఫ్యాన్స్ ని చూస్తే అమెరికాలో జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కూడా భారీగా జనాలు వస్తారని తెలుస్తుంది.

Game Changer : చరణ్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. అమెరికాలో ఫస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ‘గేమ్ ఛేంజర్’..

Fans Exciting about Ram Charan Game Changer Pre Release Event in America

Updated On : December 21, 2024 / 5:23 PM IST

Game Changer Pre Release Event : శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో రామ్ చరణ్ హీరోగా భారీగా తెరకెక్కుతున్న సినిమా ‘గేమ్ ఛేంజర్’. ఈ సినిమా సంక్రాంతికి జనవరి 10న రిలీజ్ కానుంది. స్టార్ కాస్ట్ తో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే సాంగ్స్, టీజర్ రిలీజ్ చేయడంతో ఫ్యాన్స్, ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఒక సినిమాకు ప్రమోషన్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇండియాలో చేయడం మాములే. కానీ గేమ్ ఛేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏకంగా అమెరికాలో చేస్తున్నారు.

Also Read : Pawan Kalyan : నన్ను పని చేసుకోనివ్వండి.. నేను మీసం తిప్పితే, మీరు OG అని అరిస్తే పనులు జరగవు..

అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయబోయే మొట్టమొదటి ఇండియన్ సినిమాగా గేమ్ ఛేంజర్ సరికొత్త రికార్డ్ సెట్ చేసింది. అమెరికా డేట్ ప్రకారం డిసెంబర్ 21న ఈ ఈవెంట్ జరగనుంది. అంటే మనకు రేపు ఉదయం ఈ ఈవెంట్ టెలికాస్ట్ ఉంటుంది. అమెరికా డిస్ట్రిబ్యూటర్ రాజేష్ కళ్లేపల్లి ఆధ్వర్యంలో ఈ ఈవెంట్ ని గ్రాండ్ గా ప్లాన్ చేసారు. ఇప్పటికే రామ్ చరణ్, శంకర్, దిల్ రాజు, గెస్ట్ గా వెళ్లే సుకుమార్, బుచ్చిబాబు, యాంకర్ సుమ.. పలువురు గేమ్ ఛేంజర్ నటీనటులు అమెరికాకు చేరుకున్నారు. అక్కడ వీరికి భారీ స్వాగతం పలికారు ఫ్యాన్స్.

చరణ్ కి అమెరికాలో వెల్కమ్ చెప్పడానికి వచ్చిన ఫ్యాన్స్ ని చూస్తే అమెరికాలో జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కూడా భారీగా జనాలు వస్తారని తెలుస్తుంది. ఈ ఈవెంట్ చూసి అక్కడి అమెరికా వాళ్ళతో పాటు ఇక్కడ మనవాళ్ళు కూడా ఆశ్చర్యపోవడం ఖాయం. ఇక ఇదే ఈవెంట్లో గేమ్ ఛేంజర్ నాలుగో సాంగ్ ని రిలీజ్ చేయనున్నారు. మన టైమింగ్ ప్రకారం రేపు ఉదయం 8.30 గంటలకు ఆ పాట రిలీజ్ కానుంది. అమెరికా డల్లాస్ లో దిగిన చరణ్, గేమ్ ఛేంజర్ సినిమా టీమ్ అక్కడ చరణ్ ఫ్యాన్స్ తో మీట్ అయ్యారు. ఇక ఈవెంట్ టెక్సాస్ లోని గార్లాండ్ కర్టిస్ క్యూల్వెల్ సెంటర్ లో జరగనుంది. దీంతో ఇక్కడి చరణ్ ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రేమికులు అమెరికాలో జరగబోయే మొదటి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఎదురుచూస్తున్నారు.