Trivikram – Venkatesh : త్రివిక్రమ్ – వెంకీమామ సినిమా మొదలయింది.. ఇండిపెండెన్స్ డే స్పెషల్..

గత కొన్నాళ్లుగా వెంకటేష్ త్రివిక్రమ్ తో సినిమా చేయబోతున్నాడని వార్తలు వచ్చాయి.

Trivikram - Venkatesh

Trivikram – Venkatesh : వెంకటేష్ గత సంక్రాంతి పండక్కి సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాతో వచ్చి ఏకంగా 300 కోట్లు గ్రాస్ వసూలు చేసి పెద్ద హిట్ కొట్టారు. ఆ తర్వాత వెంకీమామ ఎలాంటి సినిమాతో వస్తాడో అని అంతా ఎదురుచూశారు. గత కొన్నాళ్లుగా వెంకటేష్ త్రివిక్రమ్ తో సినిమా చేయబోతున్నాడని వార్తలు వచ్చాయి. ఆ వార్తలు ఇప్పుడు నిజమయ్యాయి.

నేడు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అధికారికంగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా కొత్త సినిమా ప్రకటిస్తూ ఈ సినిమా పూజ కార్యక్రమం నిర్వహించారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఉండబోతుంది. నిర్మాత రాధాకృష్ణ నిర్మాణంలో హారికా అండ్‌ హాసినీ క్రియేషన్స్‌ నిర్మాణ సంస్థలో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడిగా వెంకటేష్ హీరోగా ఈ సినిమా తెరకెక్కనుంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలవ్వనుందని సమాచారం.

Also Read : JD Chakravarthy : డైరెక్టర్ చెప్పాడని ప్యాంట్ ఇప్పేసి.. హైదరాబాద్ రోడ్ల మీద పరిగెత్తిన నటుడు..

వెంకటేశ్‌, త్రివిక్రమ్ కాంబినేషన్‌ అనగానే.. నువ్వు నాకు నచ్చావ్‌, మళ్లీశ్వరి సినిమాలు గుర్తుకు వస్తాయి. ఈ రెండు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌కి సినిమాలకి డైలాగ్స్‌తో పాటు కథ, స్క్రీన్‌ప్లే అందించారు త్రివిక్రమ్‌. అలాగే కరణాకరణ్ డైరెక్షన్‌ లో వచ్చిన వెంకటేశ్‌ వాసు సినిమాకి మాటలు రాసింది కూడా త్రివిక్రమే.

కానీ డైరక్టర్‌గా వెంకటేశ్‌తో కలిసి వర్క్‌ చేయలేదు త్రివిక్రమ్. చాలా కాలంగా అనుకుంటున్నా కుదరని కాంబినేషన్‌ ఇన్నాళ్లకు కుదరడంతో తెలుగు ప్రేక్షకులు, ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 2026 లో ఈ సినిమా రిలీజ్ అవుతుందని సమాచారం.

Also Read : Hrithik Roshan : వార్ 2 రిలీజ్ కి ముందు 31 కోట్లు ఖర్చుపెట్టిన హృతిక్ రోషన్.. ఎందుకంటే..?