Site icon 10TV Telugu

Sankranthiki Vasthunam : వెంకీమామ ‘సంక్రాంతికి వస్తున్నాం’ ట్రైలర్ వచ్చేసింది.. ప్రతి మగాడికి పెళ్ళికి ముందు ఒక లవర్ ఉంటుంది..

Venkatesh Sankranthiki Vasthunam Movie Trailer Released

Venkatesh Sankranthiki Vasthunam Movie Trailer Released

Sankranthiki Vasthunam : వెంకటేష్ హీరోగా తెరకెక్కుతున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమా సంక్రాంతికి కానుకగా జనవరి 14న రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి మూడు సాంగ్స్ రిలీజ్ చేయగా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. మూడు పాటలు ఫుల్ ట్రెండ్ అయి రిపీట్ లో వినేస్తున్నారు. తాజాగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా ట్రైలర్ రిలీజ్ చేసారు.

Also See : Megastar Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫొటోలు చూశారా? బాస్ నవ్వితే ఆ కిక్కే వేరప్పా..

నేడు నిజామాబాద్ లో సంక్రాంతికి వస్తున్నాం సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు.మూవీ టీమ్ అంతా ఈవెంట్ కి హాజరయ్యారు. ఈ ట్రైలర్ ని సోషల్ మీడియా వేదికగా మహేష్ బాబు రిలీజ్ చేసారు. మీరు కూడా సంక్రాంతికి వస్తున్నాం ట్రైలర్ చూసేయండి..

ఇక ఈ ట్రైలర్ చూస్తుంటే.. ఎవరో కిడ్నాప్ అయితే అది బయటకు వస్తే ప్రభుత్వానికి నష్టం జరుగుతుందని వాళ్ళను కాపాడటానికి ఎక్స్ పోలీస్ అయిన వెంకటేష్ ని తీసుకురావడానికి పోలీస్ మీనాక్షి ని పంపిస్తారు. అప్పటికే పెళ్లి అయి ఉన్న వెంకటేష్ లైఫ్ లోకి వచ్చాక భార్య, మాజీ ప్రేయసి మధ్యలో వెంకీమమ పాత్ర ఎలా నలిగింది. ఆ కిడ్నాప్ కథేంటి అని సినిమా ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనింగ్ గా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ట్రైలర్ అయితే ఫుల్ కామెడీ ఎంటర్టైనింగ్ గా ఉంది.

మహేష్ బాబు ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తూ.. మా పెద్దోడు, నా హిట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి సినిమా ట్రైలర్ లాంచ్ చేయడం ఆనందంగా ఉంది. సినిమా పెద్ద హిట్ అవ్వాలంటూ అభినందనలు తెలిపారు.

ఇక ఈ సంక్రాంతికి వస్తున్నాం సినిమాని దిల్ రాజు నిర్మాణంలో అనిల్ రావిపూడి ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమాకు ప్రమోషన్స్ కూడా వినూత్నంగా చేస్తున్నారు. ప్రమోషన్స్ తోనే ఈ సినిమాపై ఫుల్ బజ్ ఏర్పడింది. ఇప్పటికే సంక్రాంతికి వస్తున్నాం సినిమా సంక్రాంతికి హిట్ అని అంతా ఫిక్స్ అయిపోయారు. కామెడీ డైలాగ్స్ కూడా అదిరిపోతాయని తెలుస్తుంది. దీంతో సినిమాపై అంచనాలు మరిన్ని పెరిగాయి.

Also Read : SSMB 29 : రాజమౌళి – మహేష్ బాబు సినిమాపై కూడా డాక్యుమెంటరీ.. అందుకే పూజ కార్యక్రమం సీక్రెట్ గా..?

ఇక ఈ సినిమాకు కూడా ఏపీలో టికెట్ రేట్లు పెంచారు. వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు రెండు వారాల పాటు అయిదు షోలకు అనుమతులు ఇచ్చారు. మల్టీప్లెక్సుల్లో 125 రూపాయలు, సింగిల్ స్క్రీన్స్ లో 100 రూపాయలు టికెట్ రేటు పెంచుకునేలా ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

Exit mobile version