Venkatesh Sankranthiki Vasthunnam Trailer release date fix
విక్టరీ వెంకటేష్ నటిస్తున్న చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. మీనాక్షీ చౌదరి, ఐశ్వర్య రాజేష్ లు కథానాయికలుగా నటిస్తున్నారు. అనిల్ రావిపూడి, వెంకటేష్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రం పై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రమోషనల్ కార్యక్రమాలను చిత్ర బృందం మొదలుపెట్టింది. ఇప్పటి వరకు విడుదల చేసిన పాటలు సినిమా పై అంచనాలను పెంచేశాయి. ఇక ట్రైలర్ ఎప్పుడు విడుదల చేస్తారా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీని పై చిత్ర బృందం తాజాగా అప్‌డేట్ ఇచ్చింది.
Vishal Madha Gaja Raja : 2013 సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సిన సినిమా 2025 సంక్రాంతికి రిలీజ్..
ఈ నెల 6న (సోమవారం) విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌ను నిజామాబాద్‌లో నిర్వహించనున్నట్లు పేర్కొంది. కలెక్టర్ గ్రౌండ్ లో గ్రాండ్‌గా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గతంలో అనిల్ రావిపూడి, వెంకటేష్ కాంబినేషన్‌లో వచ్చిన ఎఫ్ 2, ఎఫ్ 3 చిత్రాలు ఘన విజయాలను అందుకున్న సంగతి తెలిసిందే.
After a chartbuster MUSICAL ALBUM 🥁
It’s time for the BLOCKBUSTER TRAILER ❤️🔥#SankranthikiVasthunam Trailer On January 6th🥳
Launch Event at Collector Ground, Nizamabad 💥#సంక్రాంతికివస్తున్నాం GRAND RELEASE WORLDWIDE ON 14th JANUARY, 2025.
Victory @VenkyMama @AnilRavipudi… pic.twitter.com/glp9CSXF5Y
— Sri Venkateswara Creations (@SVC_official) January 3, 2025