Vishal Madha Gaja Raja : 2013 సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సిన సినిమా 2025 సంక్రాంతికి రిలీజ్..
విశాల్, సంతానం మెయిన్ లీడ్స్ లో వరలక్ష్మి శరత్ కుమార్, అంజలి హీరోయిన్స్ గా ఈ మదగజరాజ సినిమాని తెరకెక్కించారు.

Vishal Santhanam Madha Gaja Raja Movie Released after 12 Years
Vishal Madha Gaja Raja : సాధారణంగా సినిమాల రిలీజ్ పలు కారణాలతో ఒక్కోసారి ఆలస్యం అవుతూ ఉంటాయి. ఒక నెల లేదా ఒక సంవత్సరం ఇటీవల కరోనా వల్ల మూడు, నాలుగేళ్లు తర్వాత కూడా కొన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయి. అయితే ఓ సినిమా ఆల్మోస్ట్ 12 ఏళ్ళు ఆలస్యంగా రిలీజ్ కానుంది. విశాల్ హీరోగా నటించిన తమిళ్ సినిమా మదగజరాజ 2025 సంక్రాంతికి రిలీజ్ కానుంది.
Also Read : Namrata Shirodkar : బాబోయ్.. 2024లో మహేష్ ఫ్యామిలీ ఎన్ని దేశాలు తిరిగారో తెలుసా? మహేష్ భార్య పోస్ట్ వైరల్…
విశాల్, సంతానం మెయిన్ లీడ్స్ లో వరలక్ష్మి శరత్ కుమార్, అంజలి హీరోయిన్స్ గా ఈ మదగజరాజ సినిమాని తెరకెక్కించారు. సోనూసూద్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషించారు. జెమినీ ఫిలిం సర్క్యూట్ నిర్మాణంలో సుందర్ C ఈ సినిమాని డైరెక్ట్ చేసాడు. 2013 సంక్రాంతికి ఈ సినిమాని రిలీజ్ చేయాలని ప్లాన్ చేసారు. ప్రమోషన్స్ కూడా చేసారు. సినిమా కూడా రెడీ అయింది. కానీ చివరి నిమిషంలో ఈ సినిమా రిలీజ్ అవ్వకుండా ఆగిపోయింది.
Also See : ‘తండేల్’ శివుడి సాంగ్ ప్రోమో వచ్చేసింది.. నాగ చైతన్య, సాయి పల్లవి స్టెప్స్ అదుర్స్..
ఏ కారణాలతో ఈ సినిమా ఆగిపోయిందో తెలీదు కానీ మదగజరాజ ఇప్పుడు 2025 సంక్రాంతికి రిలీజ్ కానుంది. జనవరి 12న కేవలం తమిళ్ లో రిలీజ్ కానుంది ఈ సినిమా. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమాని తెరకెక్కించినట్టు, ఇప్పుడు చూసినా ఈ స్టోరీ ఫ్రెష్ గానే ఉంటుందని డైరెక్టర్ సుందర్ తెలిపారు. సుందర్ మాత్రం ఈ సినిమాకు ప్రమోషన్స్ చేస్తున్నారు. స్టార్ కమెడియన్ సంతానం కూడా అధికారికంగా నేడు ఈ సినిమా రిలీజ్ గురించి పోస్ట్ చేసారు. దీంతో విశాల్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Kings of Entertainment @VishalKOfficial #SundarC @iamsanthanam
A @vijayantony musicalare all set to make this Pongal a Laughter Festival.
Gemini Film Circuit’s#MadhaGajaRaja
worldwide release on Jan 12.#MadhaGajaRajaJan12
#MGR #மதகஜராஜா @johnsoncinepro pic.twitter.com/9gfRXMUkH0— Santhanam (@iamsanthanam) January 3, 2025
ప్రస్తుతం తమిళ్ లో సంక్రాంతికి ఏ పెద్ద సినిమా లేకపోవడంతో చిన్న సినిమాలకు, మన గేమ్ ఛేంజర్ సినిమాకు కలిసి రానుంది. ఇప్పుడు ఈ సినిమాకు కూడా సంక్రాంతి కలిసొచ్చే అవకాశం ఉంది. ఇన్నేళ్ల తర్వాత అయినా చెప్పినట్టు జనవరి 12న మదగజరాజ సినిమా రిలీజ్ చేస్తారా లేదా చూడాలి.