Venky Atluri: మరోసారి నాన్-తెలుగు హీరోకే ప్రిఫరెన్స్ ఇచ్చిన వెంకీ అట్లూరి..?

టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరి తన నెక్ట్స్ సినిమాను కూడా ఓ నాన్-తెలుగు హీరోతో తెరకెక్కించాలని చూస్తున్నాడట.

Venky Atluri Next Movie With This Non-Telugu Hero

Venky Atluri: టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరి ఇటీవల ‘సార్’ అనే సినిమాతో తెలుగుతో పాటు తమిళంలోనూ బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాలో తమిళ హీరో ధనుష్ లీడ్ రోల్‌లో నటించగా, ఓ చక్కటి సోషల్ మెసేజ్‌తో కూడుకున్న కమర్షియల్ ఎంటర్‌టైనర్ కథగా ఈ సినిమాను వెంకీ రూపొందించాడు. ఇక ఈ సినిమా అందుకున్న సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్న వెంకీ అట్లూరి, ప్రస్తుతం తన నెక్ట్స్ ప్రాజెక్ట్ కోసం రెడీ అవుతున్నాడు.

Venky Atluri: ముచ్చటగా మూడోసారి ఆ బ్యానర్‌తో చేతులు కలిపిన వెంకీ అట్లూరి

వెంకీ అట్లూరి తన నెక్ట్స్ సినిమాను కూడా ఓ నాన్-తెలుగు హీరోతో తెరకెక్కించాలని చూస్తున్నాడట. ఈ మేరకు ఇప్పటికే హీరో దుల్కర్ సల్మాన్‌తో చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. ఈ హీరో ‘సీతా రామం’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ అందుకున్నాడు. ఇప్పుడు మరోసారి తెలుగు డైరెక్టర్‌తో వర్క్ చేసే అవకాశం రావడంతో దుల్కర్ వెంటనే ఈ ప్రాజెక్టును వినేందుకు రెడీ అయ్యాడట. అయితే, వెంకీ ఈసారి ఎలాంటి కథతో వస్తాడా.. ప్రేక్షకులను ఎంతమేర మెప్పిస్తాడా అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

Venky Atluri: ముచ్చటగా మూడోసారి ఆ బ్యానర్‌తో చేతులు కలిపిన వెంకీ అట్లూరి

ఇక ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేయనుందని.. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా వెంకీ రూపొందించాలని చూస్తున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఎప్పుడు వస్తుందా.. ఈ సినిమాను నిజంగానే దుల్కర్ సల్మాన్ చేస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది.