వెంకీమామ షూటింగ్ ఫిబ్రవరి 21నుండి మొదలవుబోతుంది.
విక్టరీ వెంకటేష్, యువసామ్రాట్ నాగచైతన్యల కాంబోలో, బాబీ డైరెక్షన్‌లో రూపొందుతున్న వెంకీమామ సినిమా ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకున్న సంగతి తెలిసిందే. సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా, కోన ఫిల్మ్ కార్పొరేషన్ సంయుక్తంగా నిర్మిస్తున్న వెంకీమామలో, చైతన్యకి జోడీగా రకుల్ ప్రీత్ నటిస్తుండగా, వెంకీ పక్కన శ్రియ, హ్యూమా ఖురేషి పేర్లు వినబడుతున్నాయి.
ఈ సినిమా షూటింగ్ ఫిబ్రవరి 21నుండి మొదలవుబోతుంది. ఈ ఏడాది ఆగష్ట్ లేదా సెప్టెంబర్‌లో రిలీజ్‌కి ప్లాన్ చేస్తున్నారు. వెంకీ, ఇంతకుముందు చైతన్య ప్రేమమ్‌లో గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఎఫ్2 సూపర్ హిట్‌తో ఫుల్ జోష్‌లో ఉన్న వెంకీ, తన మేనల్లుడు చైతుతో కలిసి పూర్తిస్థాయిలో నటిస్తున్న సినిమా కావడంతో, వెంకీమామపై మంచి అంచనాలున్నాయి.