Vennela Kishore as Hero Chaari 111 Comedy Spy Movie first look poster
Chaari111 : టాలీవుడ్ స్టార్ కమెడియన్ కిశోర్.. ‘వెన్నెల’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఆ సినిమా పేరుని తన ఇంటి పేరుగా మార్చుకున్నారు. తనదైన కామెడీ టైమింగ్ తో ఆడియన్స్ ని అలరిస్తూ వస్తున్నారు. ఒక పక్క సినిమాల్లో నటిస్తూనే మరోపక్క పలు టీవీ, ఓటీటీ షోల్లో కూడా కనిపిస్తున్నారు. టాక్ షోలతో టాలీవుడ్ స్టార్స్ ని ఇంటర్వ్యూ చేస్తూ ఆడియన్స్ ని ఆ విధంగా కూడా అలరిస్తూ వస్తున్నారు.
కమెడియన్ గా వరుస సినిమాలు చేస్తూనే ఆ మధ్య దర్శకుడిగా కూడా ప్రేక్షకులను పలకరించారు. వెన్నెల 1+1⁄2, జఫ్ఫా సినిమాలతో తనలోని దర్శకుడిని కూడా ఆడియన్స్ కి పరిచయం చేశారు. ఇప్పుడు తనలోని హీరోయిజం కూడా బయటకి తీయబోతున్నారు. ఈ ఏడాది ఆగష్టులోనే కిశోర్ హీరోగా నటిస్తున్న సినిమాని అనౌన్స్ చేశారు. ఆ చిత్రానికి చారి 111 అనే టైటిల్ ని ఖరారు చేశారు.
ఆ సమయంలో వెన్నెల కిశోర్ పాత్రని కార్టూన్ క్యారెక్టర్ రూపంలో రిలీజ్ చేశారు. తాజాగా ఆ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. బ్లాక్ సూట్, గన్‌తో వెన్నెల కిశోర్ జేమ్స్ బాండ్ లుక్ లో కనిపిస్తున్నారు. ఈ పోస్టర్ తో హీరోయిన్ లుక్ ని కూడా రివీల్ చేశారు. సంయుక్త విశ్వనాథన్ ఈ సినిమాలో హీరోయిన్ గా కనిపించబోతున్నారు. ఇక పోస్టర్ ని హైదరాబాద్ చార్మినార్, బాంబు బ్లాస్ట్, జేమ్స్ బాండ్ కారుతో చాలా ఇంటరెస్టింగ్ గా డిజైన్ చేశారు.
Also read : Priyanka Chopra : నెటిజన్లను నిరాశపరిచిన ఆ నటి దీపావళి లుక్.. మేకప్ ఆర్టిస్ట్‌పై విమర్శలు..
SPY ACTION-COMEDY ‘CHAARI 111’ FIRST LOOK POSTER OUT NOW… Unveiling #FirstLook poster of #Telugu film #Chaari111, a spy action-comedy-entertainer… Stars #VennelaKishore, #MuraliSharma and #SamyukthaViswanathan.
Written and directed by #TGKeerthiKumar and produced by… pic.twitter.com/OUPg7ClNC7
— taran adarsh (@taran_adarsh) November 14, 2023
ఈ పోస్టర్ ఆడియన్స్ లో మూవీ పై మంచి క్యూరియాసిటీ క్రియేట్ చేస్తుంది. చిరంజీవి ‘చంటబ్బాయ్’, నవీన్ పోలిశెట్టి ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’ తరహాలో ఈ చిత్రం ఉంటుందని ఆడియన్స్ భావిస్తున్నారు. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. బర్కత్ స్టూడియోస్ బ్యానర్ తెరకెక్కుతున్న ఈ సినిమాకి కీర్తి కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. మురళి శర్మ ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.