Priyanka Chopra : వామ్మో అదేం మేకప్.. ప్రియాంక చోప్రాపై నెటిజన్ల ట్రోలింగ్

ప్రియాంక, నిక్ జోనాస్ దీపావళి వేడుకల్లో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ముఖ్యంగా ప్రియాంక చోప్రా మేకప్ చూసి నెటిజన్లు షాకయ్యారు. ఎందుకలా?

Priyanka Chopra : వామ్మో అదేం మేకప్.. ప్రియాంక చోప్రాపై నెటిజన్ల ట్రోలింగ్

Priyanka Chopra

Updated On : November 14, 2023 / 4:00 PM IST

Priyanka Chopra : ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ జంట లాస్ ఏంజిల్స్‌లో దీపావళి సంబరాలు చేసుకున్నారు. ఈ జంట ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యాయి.  ప్రియాంక దీపావళి లుక్‌పై నెటిజన్లు పెదవి విరిచారు.

Unstoppable : అన్‌స్టాపబుల్ షో కోసం హైదరాబాద్ చేరుకున్న రణబీర్ కపూర్..

లాస్ ఏంజిల్స్‌లో దీపావళి వేడుకలు జరుపుకున్న ప్రియాంక చోప్రా-నిక్ జోనాస్ దంపతులు సంప్రదాయ దుస్తుల్లో మెరిశారు. ఎంతో గ్రాండ్‌గా ఈ సెలబ్రేషన్ నిర్వహించారు. ఈ వేడుకలకు సంబంధించిన వీరి ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యాయి.

ప్రియాంక వెల్వెట్ మెరూన్ బ్లౌజ్‌తో పాటు డ్యూయల్ టోన్ లెహంగాను ధరించారు. గులాబీలతో జుట్టును అలంకరించుకున్నారు. మెరూన్ టోన్‌లో బోల్డ్ ఐ షాడోను ఎంచుకున్నారు. బోల్డ్ మెరూన్ కలర్ లిప్ స్టిక్ వేసుకున్నారు. బిందీ, సింధూర్ కూడా ధరించారు. డైమండ్ నెక్లెస్‌లో కనిపించిన ప్రియాంక చాలా కొత్తగా కనిపించారు. నిక్ తెల్లటి కుర్తా, పూవుల ప్రింట్ ఉన్న జాకెట్ ధరించారు.

Guppedantha Manasu : జగతి చనిపోయిందని తెలిసి షాకైన అనుపమ..ఓల్డ్ ఫ్రెండ్స్ గెట్ టుగెదర్‌లో భారీ ట్విస్ట్

ప్రియాంక దీపావళి లుక్ ఇంటర్నెట్‌ను ఆకట్టుకోలేకపోయింది. ‘ఆమె మేకప్ ఆర్టిస్ట్ చేసిన తప్పు ఏంటి? OMG’, అని ‘ఈ మేకప్‌లో చాలా భయానకంగా ఉన్నారు మేడం’ అని నెటిజన్లు కామెంట్లు పెట్టారు. ప్రియాంక ఈ ఏడాది ‘లవ్ ఎగైన్’ అనే హాలీవుడ్ మూవీలో కనిపించారు. ప్రియాంక చోప్రా. కత్రినా కైఫ్, అలియా భట్‌లతో జోయా అక్తర్ డైరెక్షన్‌లో ‘జీ లే జరా’ సినిమా ఉంటుందని అనౌన్స్ చేశారు. ఇంకా ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లలేదు.

 

View this post on Instagram

 

A post shared by Jerry x Mimi ? (@jerryxmimi)