Guppedantha Manasu : జగతి చనిపోయిందని తెలిసి షాకైన అనుపమ..ఓల్డ్ ఫ్రెండ్స్ గెట్ టుగెదర్‌లో భారీ ట్విస్ట్
ఓల్డ్ స్టూడెంట్స్ గెట్ టుగెదర్‌లో జగతి ఎందుకు రాలేదని మహేంద్రని నిలదీస్తుంది అనుపమ. జగతి గురించి ఆమెకు అసలు నిజం తెలుస్తుందా? 'గుప్పెడంత మనసు' సీరియల్‌లో ఏం జరిగింది?

Guppedantha Manasu 5
Guppedantha Manasu : ఓల్డ్ ఫ్రెండ్స్ గెట్ టుగెదర్‌కి మహేంద్రకి చెప్పకుండా తీసుకెళ్తారు రిషి, వసుధర. తనని అక్కడికి ఎందుకు తీసుకువచ్చారని రిషి, వసుధరలని అడుగుతాడు. అనుపమ జగతి గురించి మహేంద్రని నిలదీస్తుంది. అప్పుడే ఆమెకు షాకింగ్ న్యూస్ తెలుస్తుంది. ‘గుప్పెడంత మనసు’ సీరియల్ లో ఏం జరిగింది?
Guppedantha Manasu latest 2
దేవయాని, శైలేంద్రలకు ఫోన్లో స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది వసుధర. తాను మౌనంగా ఉంటే చేతకానితనం అనుకోవద్దని అందులో మంచితనం ఉందని అంటుంది. పాలసీ ప్రకారం వెళ్తున్నానని లేదంటే నుంచున్న చోట కప్పెట్టేయగలను అంటుంది. దేవయాని, శైలేంద్ర వసుధర మాటలకు షాకవుతారు. మరోవైపు అనుపమ ఓల్డ్ ఫ్రెండ్స్ మీట్ కోసం ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేసి ఇన్వైట్ చేస్తుంది.
రిషి, వసుధరలకు కాలేజీకి వస్తారు. రిషికి ముకుల్ నుంచి ఫోన్ రావడంతో మాట్లాడుతుంటాడు. వసుధరకి శైలేంద్ర ఎదురై చాలా పొగరుగా మాట్లాడుతున్నావని అంటాడు. నీకు చావంటే భయం లేదా అని బెదిరిస్తాడు. తన వెనక ఉన్న ధైర్యం పేరు రిషి సార్ అని.. అయినా మీకు కాలేజీలో ఏం పని ఉండొచ్చారని వెటకారంగా శైలేంద్రని అడుగుతుంది వసుధర. తనను రెచ్చగొట్టద్దని చెబుతాడు శైలేంద్ర. రెచ్చిపోయి రంకెలు వేస్తున్న పశువులకు బుద్ధి చెప్పడానికి ముందడుగు వేస్తున్నా అంటుంది వసుధర. నన్ను పశువు అంటావా? నీకు బాగా పొగరు అని శైలేంద్ర వసుధరని అంటుండగా రిషి అక్కడికి వస్తాడు. దేనికి వసుధరకి పొగరు అంటున్నావు అన్నయ్యా అని అడుగుతాడు. ఎందుకు అలా అన్నారో చెప్పమని శైలేంద్రని ఇరుకున పెడుతుంది వసుధర. వసుధరకి పొగరు ఉందని ఆ పొగరు చూసి తాను ఇంప్రెస్ అయ్యానని.. తన గెలుపు వెనుక ఉన్నది కూడా పొగరే అని.. అయినా తనని ఎందుకు అంత పెద్ద మాట అన్నావు అని శైలేంద్రని అడుగుతాడు రిషి. తనకు అర్జంట్ పని ఉందని బయటకు వెళ్తున్నానని అక్కడి నుంచి రిషి వెళ్లిపోతాడు. శైలేంద్ర సమాధానం చెప్పలేక రగులుకుపోతాడు.
రిషి ముకుల్‌ని కలుస్తాడు. జగతిని షూట్ చేసిన వ్యక్తికి వచ్చిన ఫోన్ కాల్ ట్రేస్ చేస్తున్నాం అని చెప్తాడు. ఆఖరి కాల్ మాట్లాడిన వ్యక్తి ఎవరో తెలియట్లేదని.. ఆ డీటెయిల్స్ కోసం ట్రై చేస్తున్నాం అంటాడు. ఆ విషయాలు తెలిస్తేనే కేసు ఈజీ అవుతుందంటాడు రిషితో ముకుల్. అతనెలాంటివాడైనా దొరికి తీరాలంటాడు రిషి. తన తల్లి ఎలాగు తిరిగి రాదని డీబీఎస్టీ కాలేజీ మళ్లీ చిక్కుల్లో పడకుండా ఉండాలన్నా.. తన తండ్రి మహేంద్ర ముందు తల్లిని చంపిన వాడిని నిలబెట్టాలని అంటాడు రిషి.
మహేంద్రకి అలూమినికి రమ్మని ఫ్రెండ్స్ ఫోన్ చేస్తారు. వాళ్లతో రాలేనని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు మహేంద్ర. అప్పుడే వచ్చిన రిషి ఎవరికి డాడీ రాలేనని చెబుతున్నారు అని అడుగుతాడు. రిషికి సమాధానం చెప్పకుండా మహేంద్ర అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మహేంద్రకి వచ్చిన ఫోన్ కాల్ రిషి ఎత్తుతాడు. కాల్ చేసింది అనుపమ అని తెలిసి షాకవుతాడు రిషి. తన పేరు అనుపమ అని చెప్పగానే అరకులో కలిసినది మీరేనా అని అడుగుతాడు రిషి. నీకు అన్ని వివరాలు తెలియాలంటే మహేంద్రని గెట్ టుగెదర్‌కి తీసుకురమ్మని తనతోపాటు మీరు కూడా రమ్మని పిలుస్తుంది అనుపమ. జగతిని కూడా తప్పకుండా తీసుకురమ్మని చెబుతుంది. జగతి గురించి రిషి చెప్పేలోపు ఫోన్ కట్ చేస్తుంది అనుపమ.

Guppedantha Manasu 6
మహేంద్రకి ఎక్కడికి వెళ్తున్నారో చెప్పకుండా రెడీ చేసి అనుపమ ఏర్పాటు చేసిన గెట్ టుగెదర్‌కి తీసుకెళ్తారు రిషి, వసుధర. గేట్ బయట పూర్వ విద్యార్ధుల ఆత్మీయ సమ్మేళనం అన్న ఫ్లెక్సీ చూసి షాకవుతాడు మహేంద్ర. తనని ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చారని.. ఫ్రెండ్స్‌తో తాను రానని చెప్పానని అంటాడు మహేంద్ర. తనకి ఎవరూ ఫ్రెండ్స్ లేరని అంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన అనుపమ కొన్ని సిట్యుయేషన్స్ నుంచి తప్పించుకోవాలన్నా తప్పించుకోలేము.. ముఖ్యంగా స్నేహితుల నుంచి అంటుంది. చూసావా నిన్ను ఎలా రప్పించానో అంటుంది. ఈలోపు ఫ్రెండ్స్ వచ్చి మహేంద్రని లోనికి తీసుకెళ్తారు. జగతిని ఎందుకు తీసుకురాలేదని రిషిని అడుగుతుంది అనుపమ.. రిషి సమాధానం చెప్పేలోపు స్నేహితులు పిలవడంతో అందరూ లోనికి వెళ్తారు.
Guppedantha Manasu : రిషి, వసుధరలపై కోపంతో రగిలిపోయిన ఏంజెల్.. విశ్వనాథం ఇంటికి వచ్చిన అనుపమ
గెట్ టుగెదర్ మొదలు అవుతుంది. అక్కడికి విశ్వనాథం, ఏంజెల్ కూడా వస్తారు. వాళ్లని చూసి మహేంద్ర ఫ్యామిలీ ఆశ్చర్యపోతారు. మరీ ముఖ్యంగా అనుపమ విశ్వనాథంని డాడీ అని పిలవడం చూసి షాకవుతారు. అప్పుడే వారికి అనుపమ విశ్వనాథం కూతురని తెలుస్తోంది. అందరూ మహేంద్రని స్టేజ్ మీద మాట్లాడమని బలవంతం చేస్తారు. అందరూ జగతి గురించి అడగటంతో మహేంద్ర పూర్తిగా ఎమోషనల్ అయిపోతాడు. ఏమీ మాట్లాడలేక స్టేజ్ మీద నుంచి వెళ్లిపోతాడు. అతని వెనుక వెళ్లిన అనుపమ అసలేమైంది? ఎందుకిలా చేసావు.. జగతి ఏమైంది అని నిలదీస్తుంది. మహేంద్ర ఏం చెప్పాలో తెలియక సతమతమవుతాడు. లేని జగతి గురించి ఆయన ఏం చెప్తారంటుంది వసుధర. జగతి చనిపోయిందని చెబుతుంది. వసుధర మాటలకు షాకైన అనుపమ ఏమైందని మళ్లీ మహేంద్రని ప్రశ్నిస్తుంది. జగతి లేదు.. చనిపోయిందని మహేంద్ర నోటి వెంట రావడంతో ఒక్కసారిగా షాకైపోతుంది అనుపమ. ఆ తర్వాత ఏమైంది? అంటే నెక్ట్స్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే.

Guppedantha Manasu latest 3
ఎంతో ఉత్కంఠగా సాగుతున్న ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌లో ముకేష్ గౌడ, రక్ష గౌడ, సాయి కిరణ్, జ్యోతి రాయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కాపుగంటి రాజేంద్ర ఈ సీరియల్‌ను డైరెక్ట్ చేస్తున్నారు.