Venu Thottempudi First Look From Ramarao On Duty Revealed
Venu Thottempudi: మాస్ రాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రామారావు ఆన్ డ్యూటీ’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు శరత్ మండవ తెరకెక్కిస్తుండగా, ఈ మూవీలో రవితేజ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా తీర్చిదిద్దారు చిత్ర యూనిట్. ఓ ప్రభుత్వ ఉద్యోగిగా రవితేజ పర్ఫార్మెన్స్ మరో లెవెల్‌లో ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.
Ramarao On Duty: నా పేరు సీసా.. స్వర్గానికి వీసా.. అదిరిపోయిన మాస్ ట్రీట్!
ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్స్, టీజర్స్, సాంగ్స్ ఈ సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. ఇక ఈ సినిమాలో ఒకప్పటి హీరో వేణు తొట్టెంపూడి ఓ పవర్‌ఫుల్ పాత్రలో సినిమాల్లోకి మళ్లీ కమ్‌బ్యాక్ ఇవ్వబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. గతంలో హీరోగా పలు బ్లాక్‌బస్టర్ సినిమాల్లో నటించిన వేణు తొట్టెంపూడి, ఆ తరువాత వరుస ఫెయిల్యూర్స్ కారణంగా స్పెషల్ రోల్స్ కూడా చేశాడు. అయితే కొంతకాలంగా సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఈ హీరో, ఇప్పుడు తిరిగి రామారావు ఆన్ డ్యూటీ చిత్రంతో వెండితెరపై మెరవనున్నాడు.
Ramarao On Duty: రామారావు చార్జి తీసుకునేది అప్పుడే!
ఇక ఈ సినిమాలో వేణు తొట్టెంపూడి ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నట్లు ఆయన పాత్రకు సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ సినిమాలో CI మురళి అనే పాత్రలో వేణు మనల్ని ఎంటర్‌టైన్ చేసేందుకు రెడీ అయ్యాడు. ఇక సరికొత్త లుక్‌లో వేణును చూసిన ప్రేక్షకులు ఈ సినిమాతో ఆయనకు మళ్లీ పూర్వ వైభవం దక్కాలని కోరుతున్నారు. వేణుకు ఈ సినిమా మంచి బ్రేక్ ఇస్తే, ఇక వరుసగా సినిమాలు చేయడం ఖాయమని ఆయన అభిమానులు అంటున్నారు. కాగా, రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో రవితేజ సరసన అందాల భామలు దివ్యాంశ కౌశిక్, రాజీషా విజయన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను జూలై 29న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.
Our favourite ever is back in a never before Powerful role ?
Introducing #VenuThottempudi as CI Murali from #RamaRaoOnDuty ?#RamaRaoOnDutyOnJuly29@RaviTeja_offl @directorsarat @itsdivyanshak @rajisha_vijayan @SamCSmusic @RTTeamWorks @LahariMusic pic.twitter.com/92ciBfxFBw
— SLV Cinemas (@SLVCinemasOffl) July 6, 2022