Siri Hanmanth-Shrihan : ఎన్నాళ్లనుంచో రిలేషన్.. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న జంట..!
యూట్యూబ్, షార్ట్ ఫిల్మ్స్, ఇన్‌స్టా రీల్స్‌తో పాపులరయ్యారు సిరి హనుమంతు-శ్రీహాన్.

Very soon Siri Hanmanth Shrihan marriage in Vizag
యూట్యూబ్, షార్ట్ ఫిల్మ్స్, ఇన్‌స్టా రీల్స్‌తో పాపులరయ్యారు సిరి హనుమంతు-శ్రీహాన్. బిగ్‌బిస్ సీజన్ 5లో సిరి, సీజన్ 6లో శ్రీహాన్‌లు పాల్గొని మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆన్ స్ర్కీన్ పై ఎంతో అందంగా కనిపించే ఈ జంట నిజ జీవితంలోనూ ప్రేమలో ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రేక్షకులకు ఈ లవ్ బర్డ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
వీరిద్దరి ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు అనే ఆసక్తి చాలా మందిలో ఉంది. అదిగో ఇదిలో అంటూ వార్తలు వచ్చాయి. అయితే.. అవి పుకార్లుగానే మిగిలిపోయాయి. పెళ్లి గురించి వీరిద్దరు పలు సందర్భాల్లో మాట్లాడారు. త్వరలోనే అన్నారు తప్ప ఎప్పుడు అనేది చెప్పలేదు. ఇక పెళ్లికాక ముందే.. వీరిద్దరు ఓ చిన్నారిని దత్తత తీసుకుని పెంచుకుంటున్నారు అన్న సంగతి తెలిసిందే.
Akshara Gowda : పండంటి బిడ్డకి జన్మనిచ్చిన ప్రముఖ హీరోయిన్.. బిడ్డ ఫొటోలు షేర్ చేస్తూ..
తాజాగా.. త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోనున్నారు అనే వార్త వైరల్ అవుతోంది. అయితే ఈ సారి పెళ్లి వెన్యూ కూడా చెబుతున్నారు. అతి త్వరలో వైజాగ్‌లో వీరి వివాహం జరగనుందని సోషల్ మీడియాలో ఓ వార్త ట్రెండ్ అవుతోంది. త్వరలోనే ఇందుకు సంబంధించి ప్రకటన వెలువడనుందని సదరు వార్త సారాంశం.
Dil Raju : టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజుకి తెలంగాణ సర్కార్ కీలక పదవి..
View this post on Instagram