పెళ్లి చేసుకుంటా అంటున్న నగ్మా

  • Publish Date - March 4, 2019 / 09:16 AM IST

తొంబైలలో తెలుగు సినిమాలలో అగ్రతారగా ఉన్న వెటరన్ హీరోయిన్ నగ్మా.. తన పెళ్లికి సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిత్రపరిశ్రమలో ఒక వెలుగు వెలిగిన నగ్మా.. ప్రస్తుతం కాంగ్రెస్ నాయకురాలిగా ఉంది. ఇప్పటివరకు పెళ్లి చేసుకోని ఆమె.. తాజాగా తన వివాహం గురించి నగ్మా స్పందించారు. తనకు దాంపత్య జీవితంపై నమ్మకం ఉందని సరైన సమయం వచ్చింది అనుకున్నప్పుడు తప్పకుండా పెళ్లి చేసుకుంటానంటూ ఆమె వెల్లడించారు.

గతంలో నగ్మా పలువురు హీరోలతో, ఓ క్రికెటర్ తో  డేటింగ్ చేసిందంటూ వార్తలు రాగా వాటిపై ఎప్పుడు కూడా ఆమె స్పందించలేదు. ప్రస్తుతం తన జీవితంలో ఎవ్వరూ లేరని, సరైన వ్యక్తి దొరికితే మాత్రం అందరి సమక్షంలో పెళ్లి చేసుకుంటానంటూ ప్రకటించింది.మాజీ క్రికెటర్‌ సౌరవ్‌ గంగూలీతో నగ్మ డేటింగ్ లో ఉందంటూ అప్పట్లో వార్తలు రాగా నిజమేనని నగ్మ అప్పట్లో స్పష్టం చేశారు. 2001లో తాను సౌరవ్‌ ప్రేమించుకున్నామని, కానీ తన కారణంగా సౌరవ్‌ కెరీర్‌ నష్టపోతారని భావించి తానే గంగూలీని వదులుకున్నట్లు తెలిపింది.  

‘కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి. నాకు తనకంటే ముఖ్యమైన బాధ్యతలు ఉన్నాయి. తనకూ అంతే..’ అని అప్పట్లో చెప్పారు. నగ్మకు ఇప్పుడు 44ఏళ్లు కాగా.. జాతీయపార్టీ కాంగ్రెస్ లో ముఖ్యనేతగా ఉన్నారు. తెలుగులో ‘కిల్లర్‌’, ‘ఘరానా మొగుడు’, ‘మేజర్‌ చంద్రకాంత్‌’, ‘బాషా’, ‘కొండపల్లి రాజా’ వంటి సినిమాలతో ఆకట్టుకోగా ఇటీవలి కాలంలో నటనకు దూరంగా ఉంది. మెగాస్టార్ తో నగ్మా కాంబినేషన్ కు మంచి క్రేజ్ ఉండేది. అయితే అల్లూ అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ద్వారా మళ్లీ తెలుగుతెరకు ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి. చిత్రబృందం మాత్రం అఫిషియల్ గా ప్రకటించలేదు.