Chhaava : విక్కీ కౌషల్, రష్మిక ‘ఛావా’ ఓవరాల్ 1000 కోట్ల సినిమా అవుతుందా? అందులో తెలుగు టార్గెట్ ఎంత..?

మహారాష్ట్ర మాత్రమే కాదు దేశం మొత్తం దండయాత్ర చేస్తున్నాడు శంభాజీ మహారాజ్.

Vicky Kaushal Rashmika Mandanna Chhaava Movie Telugu Release Target

Chhaava : మహారాష్ట్ర యోధుడు చత్రపతి శివాజీ మహారాజ్ కొడుకు శంబాజీ మహారాజ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఛావా సినిమా గ్రాండ్‌ సక్సెస్ అయింది. విక్కీ కౌశల్, రష్మిక మందన్న జంటగా హిందీలో వచ్చిన ఈ మూవీ దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. విడుదలకు ముందు ఈ సినిమా ఒక్క మహారాష్ట్రలోనే భారీ హిట్ కొడుతుందనే అంచనా వేశారు. అయితే రిలీజ్ తర్వాత సీన్ మారిపోయింది.

మహారాష్ట్ర మాత్రమే కాదు దేశం మొత్తం దండయాత్ర చేస్తున్నాడు శంభాజీ మహారాజ్. ఆ యోధుడు దెబ్బకు కలెక్షన్లకు వర్షం కురుస్తుంది. ఇప్పటికే ఈ సినిమా 500 కోట్లు కలెక్ట్ చేసి 600 కోట్ల వైపు దూసుకుపోతుంది. హిందీలోనే కాక వేరే భాషల్లో కూడా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుండటంతో ఈ మూవీని రీజనల్ లాంగ్వేజెస్‌లోకి డబ్బింగ్‌ చేయాలని భావిస్తున్నారు.

Also Read : Good Bad Ugly : అజిత్ కుమార్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ టీజర్ వచ్చేసింది.. మాస్ లుక్స్ తో అజిత్ అదరగొట్టాడుగా..

తెలుగులో ఛావా మూవీని మార్చి 7న గీతా ఆర్ట్స్ రిలీజ్ చేస్తుంది. కేవలం హిందీలోనే 600 కోట్లు వసూళ్లు ఉంటే మిగతా లాంగ్వేజ్‌లల్లో రిలీజ్ చేస్తే 1000 కోట్లు దాటడం ఖాయమన్న టాక్ వినిపిస్తోంది. అయితే చావా తెలుగు వెర్షన్ కలెక్షన్స్ టార్గెట్ 100 కోట్లు ఉంటుందని ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు. తెలుగులో బీసీ సెంటర్స్‌తో పాటు మల్టీపెక్స్‌లలో భారీ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. ఛావా టీమ్‌తో టాలీవుడ్ లో ఒక ఈవెంట్ ఏర్పాటు చేసి పబ్లిసిటీ చేయాలని ప్లాన్ చేస్తున్నారట.

Also Read : Rambha : అప్పట్లో కుర్రాళ్ళ కలల రాణి.. ‘రంభ’.. మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ

ఛావాకి తెలుగులో ఎలాగో రష్మిక క్రేజ్ కూడా తోడవుతుంది. మార్చ్ 7న పెద్ద సినిమాలు కూడా లేవు. మరి ఛావా సినిమా తెలుగులో 100 కోట్లు వసూలు చేస్తుందా లేదా అనేది వేచి చూడాలి. ఇక గీతా ఆర్ట్స్ ఇటీవలే తండేల్ రిలీజ్ చేసి 100 కోట్లు వసూళ్లు చేసింది.