Victory Venkatesh speech at NTR 100 Years about senior ntr
100 Years of NTR : 2023 మే 28న నందమూరి తారక రామారావు శత జయంతి జరుగుతుండడంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా గత ఏడాది నుంచి శత జయంతి ఉత్సవాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలోనే ఇటీవల విజయవాడ(Vijayawada)లో భారీ సభ నిర్వహించగా రజినీకాంత్(Rajinikanth) ముఖ్య అతిథిగా వచ్చాడు. తాజాగా హైదరాబాద్ KPHB లో గ్రౌండ్స్ లో మరో కార్యక్రమాన్ని నిర్వహించారు.
NTR 100 Years : బాలయ్యతో వివాదం.. ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో నాగచైతన్య.. ఏమి మాట్లాడాడో తెలుసా?
ఈ ఈవెంట్ కి ఇండస్ట్రీ నుంచి వెంకటేష్, శివరాజ్ కుమార్, రామ్ చరణ్, నాగచైతన్య, అడివిశేష్, సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్, జయసుధ, జయప్రద, శ్రీలీల, అలాగే దర్శకులు తదితరులు హాజరయ్యారు. ఇక కార్యక్రమంలో వెంకటేష్ (Venkatesh) మాట్లాడుతూ.. “సినీ పరిశ్రమకు ఎన్టీఆర్ గారు ఎంతో సేవ చేశారు. అలాంటి వ్యక్తి గురించి మాట్లాడే అర్హత నాకు లేదు. ఆయన మన మధ్య బౌతికంగా లేకపోయినా ఇప్పటికి ఆయన పేరు వినిపిస్తుందంటే అదే ఆయన గొప్పతనం. నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏ బాష వాళ్ళు అని అడిగినప్పుడు తెలుగు వాడిని అని గర్వంగా చెబుతాను. ఆ గర్వం పేరే ఎన్టీఆర్” అని వ్యాఖ్యానించాడు.
తెలుగు ప్రజల కథే ఎన్టీఆర్ అని, తెలుగు జాతి కథే ఎన్టీఆర్ అని చెప్పుకొచ్చిన వెంకటేష్.. నటుడిగా తనకి ఎన్టీఆర్ తో నటించే అవకాశం దొరకలేదని, ఆ లోటుని ‘కలుసుందాం రా’ సినిమాలో ఒక పాటలో స్పెషల్ ఎఫెక్ట్స్ లో ఎన్టీఆర్ ని చూపిస్తూ తీర్చుకున్నట్లు చెప్పుకొచ్చాడు. ఇక తమ సురేష్ ప్రొడక్షన్స్ కి ‘రాముడు భీముడు’ సినిమాతో మర్చిపోలేని హిట్టుని అందించినందుకు ఎప్పటికి ఎన్టీఆర్ కి రుణపడి ఉంటాము అంటూ వ్యాఖ్యానించాడు.