Victory Venkatesh talk about his son Arjun Daggubati in Unstoppable show
విక్టరీ వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో సంక్రాంతికి వస్తున్నాం అనే చిత్రం తెరకెక్కుతోంది. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ కథానాయికలు. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైన్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్‌లో బాగంగా విక్టరీ వెంకటేశ్, అనిల్ రావిపూడిలు బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షోకి వచ్చారు.
హోస్ట్ బాలయ్య ఊరుకుంటారా? సరదా ఆటలు ఆడిస్తూనే తన దైన శైలిలో ప్రశ్నలను అడిగారు. ఈ సందర్భంగా వెంకటేశ్ కొడుకు అర్జున్ గురించి ఓ ప్రశ్న అడిగారు. తన కొడుకు అర్జున్ వయసు 20 సంవత్సరాలు అని, ప్రస్తుతం అతడు అమెరికాలో చదువుకుంటున్నాడని వెంకటేష్ చెప్పాడు. అతడు చాలా నిదానం అని తెలిపాడు. ఇక సినిమాల్లోకి అర్జున్ రానున్నాడా? ఇంకా తన కొడుకు గురించి వెంకటేష్ ఏమని చెప్పాడో తెలుసుకోవాలంటే ఎపిసోడ్ స్ట్రీమింగ్ వరకు వెయిట్ చేయక తప్పదు.
Ajith Daughter : తమిళ్ స్టార్ హీరో అజిత్ కూతుర్ని చూశారా? ఒక్కసారిగా వైరల్ అవుతున్న అనౌష్క..
వెంకటేష్, బాలకృష్ణలు అనిల్ పూడిని సరదాగా కార్నర్ చేశారు. ఇరుకున పెట్టే ప్రశ్నలు అడిగారు. బాలయ్య, వెంకటేష్‌లలో ఎవరికి హీరోయిన్ మీనాక్షి చౌదరి సరిజోడనే ప్రశ్న వేశారు. బాలయ్య, వెంకీతో కలిపి ఓ మల్టీస్టారర్ తీసే ఆలోచన ఏమైన ఉందా అనే ప్రశ్న సైతం అడిగారు. మరి ఈ ప్రశ్నలకు అనిల్ రావిపూడి ఏమని సమాధానం చెప్పాడో తెలుసుకోవాలంటే ఎపిసోడ్ స్ట్రీమింగ్ వరకు ఆగాల్సిందే.
ఈ ఎపిసోడ్ ఆహా వేదికగా డిసెంబర్ 27 శుక్రవారం రాత్రి 7 గంటల నుంచి స్ట్రీమింగ్ కానుంది.