Ajith Daughter : తమిళ్ స్టార్ హీరో అజిత్ కూతుర్ని చూశారా? ఒక్కసారిగా వైరల్ అవుతున్న అనౌష్క..

తాజాగా పీవీ సింధు రిసెప్షన్ లో కనిపించి ఒక్కసారిగా అందరి దృష్టి ఆమెపై పడేలా చేసింది అజిత్ కూతురు అనౌష్క.

Ajith Daughter : తమిళ్ స్టార్ హీరో అజిత్ కూతుర్ని చూశారా? ఒక్కసారిగా వైరల్ అవుతున్న అనౌష్క..

Ajith Daughter Anoushka Kumar goes Viral after her Presence in PV Sindhu Reception

Updated On : December 26, 2024 / 2:04 PM IST

Ajith Daughter : సెలబ్రిటీల పిల్లలు బయట కనిపిస్తే బాగా వైరల్ అవుతారు. చాలా మంది సినీ ప్రముఖులు తమ పిల్లలను ఎక్కువగా బయట కనపడనివ్వరు. తాజాగా తమిళ్ స్టార్ హీరో అజిత్ కూతురు వైరల్ అవుతుంది. ఇటీవల పీవీ సింధు రిసెప్షన్ కి అజిత్ తన భార్య పిల్లలతో కలిసి వచ్చాడు. దీంతో ఈ విజువల్స్ వైరల్ గా మారాయి. ముఖ్యంగా అజిత్ కూతురు కొంచెం గ్యాప్ తర్వాత కనపడటంతో అందరి దృష్టి ఆమెపైనే ఉంది.

అజిత్ ఒకప్పటి హీరోయిన్ షాలినిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి ఒక పాప, ఒక బాబు ఉన్నారు. వీరి పాప పేరు అనౌష్క కుమార్. బాబు పేరు ఆద్విక్. అప్పుడప్పుడు షాలిని తన సోషల్ మీడియాలో ఆద్విక్ తో ఉన్న ఫోటోలు షేర్ చేస్తుంది. రేర్ గా అనౌష్క తో ఉన్న ఫొటోలు షేర్ చేస్తుంది. అనౌష్క 2008లో పుట్టింది. ఇప్పుడు ఈమెకు 16 ఏళ్ళు.

Also Read : Dil Raju : బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు చిన్న అంశం.. సీఎంతో మీటింగ్ తర్వాత దిల్ రాజు కామెంట్స్..

తాజాగా పీవీ సింధు రిసెప్షన్ లో కనిపించి ఒక్కసారిగా అందరి దృష్టి ఆమెపై పడేలా చేసింది అనౌష్క. ట్రెడిషినల్ గా గాగ్రా చోళీలో వచ్చి క్యూట్ గా కళ్ళజోడు పెట్టుకొని కనిపించింది. తన తండ్రి అజిత్ వెనక నడుస్తూ వచ్చిన విజువల్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

View this post on Instagram

A post shared by Tollywood Tide (@tollywoodtide)

అనౌష్క ఇటీవలే స్కూల్ స్టడీస్ పూర్తిచేసి కాలేజీలోకి అడుగుపెట్టింది. అలాగే ఈమె ఒక కేక్ బేకర్ కూడా. తాను చేసే కేక్ డిజైన్స్ తో ఓ సోషల్ మీడియా అకౌంట్ కూడా నడిపిస్తుంది. ఈమె బ్యాడ్మింటన్ ప్లేయర్ కూడా. స్కూల్ లెవెల్లో స్టేట్ టోర్నమెంట్స్ లో కూడా ఆడింది. అనౌష్క చిన్నప్పుడు తన తండ్రి అజిత్ నటించిన ఎన్నై ఆరిందాల్ సినిమాలో ఓ చిన్న పాత్ర కూడా చేసింది.

అనౌష్కకు సోషల్ మీడియా అకౌంట్ ఉన్నా ప్రైవేట్ లో పెట్టుకుంది. అప్పుడప్పుడు షాలినినే అనౌష్కతో కలిసి దిగిన ఫోటోలు షేర్ చేస్తుంది. ఇప్పుడు పీవీ సింధు రిసెప్షన్ లో ఇలా కనపడేసరికి ఒక్కసారిగా అజిత్ కూతురు అంటూ వైరల్ అయింది అనౌష్క. మరి తన తల్లితండ్రుల్లాగే సినీ పరిశ్రమలోకి వస్తుందా లేక వేరే కెరీర్ లోకి వెళ్తుందా చూడాలి.

Also Read : Anaganaga Oka Raju : ‘అన‌గ‌న‌గా ఒక రాజు’ టీజ‌ర్ రిలీజ్‌.. న‌వీన్ పొలిశెట్టి ఈస్ బ్యాక్‌..