Vidaa Muyarchi teaser : అజిత్ ‘విదాముయార్చి’ టీజ‌ర్ వ‌చ్చేసింది.. నో డైలాగ్స్‌.. యాక్ష‌న్‌, థ్రిల్లింగ్ సీన్స్ అదుర్స్‌..

కోలీవుడ్ స్టార్ హీరో తలా అజిత్ కుమార్ న‌టిస్తున్న మూవీ ‘విదాముయార్చి.

Vidaa Muyarchi teaser our now

కోలీవుడ్ స్టార్ హీరో తలా అజిత్ కుమార్ న‌టిస్తున్న మూవీ ‘విదాముయార్చి. తిరుమేని ద‌ర్శ‌క‌త్వంలో ఈ మూవీ తెర‌కెక్కుతోంది. లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ మూవీని భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తోంది. ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌లో త్రిష కథానాయిక‌.

ఈ చిత్రంలో అర్జున్, రెజీనా, సంజయ్‌ దత్ లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్‌ సంగీతం అందిస్తుండ‌గా.. నీరవ్‌ షా, ఓం ప్రకాశ్‌ ఛాయాగ్రాహకులుగా వ్యవహరిస్తున్నారు.

Vijay Deverakonda – Allu Arjun : అల్లు అర్జున్ కి స్పెషల్ పుష్ప గిఫ్ట్ పంపించిన రౌడీ స్టార్.. నా స్వీటెస్ట్ బ్రదర్ అంటూ బన్నీ పోస్ట్..

సినీ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టీజ‌ర్ వ‌చ్చేసింది. ఒక్క డైలాగ్ కూడా లేకుండా టీజ‌ర్ ఉంది. ఆకట్టుకునే యాక్షన్, థ్రిల్లింగ్ సీన్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఫైట్స్ తో టీజర్ రూపుదిద్దుకుంది.

ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా 2025 జ‌న‌వ‌రిలో విడుద‌ల చేయ‌నున్న‌ట్లు టీజ‌ర్ ఆఖ‌రిలో వెల్ల‌డించారు. కాగా.. యూట్యూబ్ లో ఈ టీజ‌ర్ దూసుకుపోతుంది.

Rashmika Mandanna : నా సామి.. అంటూ కొచ్చి పుష్ప ఈవెంట్లో రష్మిక.. చీరలో క్యూట్‌గా నేషనల్ క్రష్.. ఫొటోలు చూశారా?