Anasuya Bharadwaj : నన్ను ద్వేషించేవారికి ఓ సందేశం.. అనసూయ పెట్టిన పోస్ట్ వైరల్

బుల్లితెరకు దూరంగా ఉంటూ సిల్వర్ స్క్రీన్‌పై వరుస సినిమాలతో దూసుకుపోతున్న అనసూయ సోషల్ మీడియాలో కూడా సూపర్ ఫాస్ట్‌గా ఉంటుంది. తన పోస్టులతో రచ్చరచ్చ చేస్తుంది. తాజాగా తన హేటర్ల కోసం అంటూ ఆమె పోస్ట్ చేసిన వీడియో వైరల్ అవుతోంది.

Anasuya Bharadwaj

Anasuya Bharadwaj : యాంకర్ అనసూయ సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్కే. ఏదో ఒక పోస్టులతో వైరల్ అవుతూ ఉంటుంది. రీసెంట్‌గా ఆమె పెట్టిన వీడియో మరోసారి వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ వీడియో ఏముందంటే?

Anasuya : షర్ట్ బటన్స్ తీసి మరి ఫోటోలకు ఫోజులిచ్చిన అనసూయ..

ప్రస్తుతం సిల్వర్ స్క్రీన్‌పై వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది అనసూయ. రంగస్థలం, పుష్ప సినిమాలతో సుకుమార్ సినిమాల్లో ఛాన్స్ కొట్టేసి మంచి క్రేజ్ సంపాదించుకున్న అనసూయ టీవీ షోస్ మానేసి సినిమాల్లో బిజీ అయిపోయింది. ప్రస్తుతం పుష్ప 2, పెదకాపు, సింబ, ప్రేమ విమానం, వుల్ఫ్ సినిమాల్లో నటిస్తోంది. ఓవైపు సినిమాల్లో చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో కూడా సూపర్ యాక్టివ్‌గా ఉంది. ఎక్కువగా తన హాట్ హాట్ ఫోటోలు షేర్ చేసే అనసూయ తాజాగా తన హేటర్లకి ఓ వీడియో అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియో వైరల్ అవుతోంది.

Anasuya : క్లోజప్ అందాలతో మైమరిపిస్తున్న అనసూయ..

అనసూయ పోస్ట్ చేసిన వీడియోలో ‘నేను చేసే పని నచ్చకపోయినా మీరు చూస్తున్నారు. కాబట్టి ఇప్పటికీ మీరు నా అభిమానులే’ అంటూ పోస్ట్ పెట్టింది. ఇక అనసూయ పోస్టు పెడితే జనాలు ఊరుకుంటారా? కొంతమంది తన మాట నిజమేనంటూ సపోర్ట్ చేస్తుంటే.. ఏ పనీ లేక ఇలాంటి పోస్టులు పెడుతోందని కొందరు విమర్శలు గుప్పించారు. పాజిటిల్ అయినా నెగెటివ్ అయినా ఎప్పుడూ తను మాత్రం వార్తల్లో ఉండేలా చూసుకుంటోంది అనసూయ.