Bichagadu 2: విజయ్ ఆంటోనీ ‘బిచ్చగాడు 2’ వచ్చేది అప్పుడే!

తమిళ నటుడు విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన ‘బిచ్చగాడు’ టాలీవుడ్‌లో ఎలాంటి సెన్సేషనల్ హిట్‌ను అందుకుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ చేయగా, బాక్సాఫీస్ వద్ద సూపర్ టాక్‌తో దూసుకుపోయిన ఈ సినిమా నిర్మాతలకు లాభాల పంటను తెచ్చిపెట్టింది. ఇక ఆ సినిమా తరువాత విజయ్ ఆంటోనీ చేసిన ప్రతి సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తూ వచ్చారు.

Vijay Antony Bichagadu 2 Movie To Release In Summer

Bichagadu 2: తమిళ నటుడు విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన ‘బిచ్చగాడు’ టాలీవుడ్‌లో ఎలాంటి సెన్సేషనల్ హిట్‌ను అందుకుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ చేయగా, బాక్సాఫీస్ వద్ద సూపర్ టాక్‌తో దూసుకుపోయిన ఈ సినిమా నిర్మాతలకు లాభాల పంటను తెచ్చిపెట్టింది. ఇక ఆ సినిమా తరువాత విజయ్ ఆంటోనీ చేసిన ప్రతి సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తూ వచ్చారు.

Vijay Antony: విడాకులకు సిద్ధమైన మరో హీరో?

అయితే ఇప్పుడు మళ్లీ బిచ్చగాడు సినిమాకు సీక్వెల్ అయిన ‘బిచ్చగాడు-2’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు విజయ్ ఆంటోనీ రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను విజయ్ ఆంటోనీ స్వయంగా డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై కోలీవుడ్ వర్గాలతో పాటు తెలుగు ప్రేక్షకుల్లోనూ మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని అందరూ ఆసక్తిగా చూస్తుండగా, తాజాగా ఈ సినిమా రిలీజ్‌పై చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది.

Vijay Antony : ‘బిచ్చగాడు 2’ తో దర్శకుడిగా విజయ్ ఆంటోని..

బిచ్చగాడు-2 సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఈమేరకు వారు సోషల్ మీడియాలో క్లారిటీ కూడా ఇచ్చారు. ఇక కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు మ్యూజిక్, ఎడిటింగ్ వర్క్ కూడా విజయ్ ఆంటోనీయే చేస్తున్నాడు. దేవ్ గిల్, హరీష్ పెరడి, జాన్ విజయ్, రాధా రవి, మన్సూర్ అలీ ఖాన్, వైజీ మహేంద్రన్, రాజా కృష్ణమూర్తి తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మరి ఈ బిచ్చగాడు-2 సినిమాకు ప్రేక్షకులు ఎలాంటి రెస్పాన్స్‌ను ఇస్తారో చూడాలి.