Arabic Kuthu: సరికొత్త రికార్డులు సెట్ చేస్తున్న విజయ్ హలమితి హాబీబో!

తమిళ స్టార్ హీరో విజయ్, బుట్టబొమ్మ పూజ హెగ్డే జంటగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కామెడీ యాక్షన్ థ్రిల్లర్ 'బీస్ట్'.

Arabic Kuthu

Arabic Kuthu: తమిళ స్టార్ హీరో విజయ్, బుట్టబొమ్మ పూజ హెగ్డే జంటగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కామెడీ యాక్షన్ థ్రిల్లర్ ‘బీస్ట్’. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 14న రిలీజ్ కాబోతుంది. ఈ చిత్రం నుంచి వాలంటైన్స్ డే సందర్భంగా విడుదలైన ఫస్ట్ సింగిల్ ‘అరబిక్ కుతు’ ఫుల్ లిరికల్ వీడియో సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్‌ను షేక్ చేస్తుంది.

Arabic Kuthu-Vedhika: హలమితి హబిబో పాటకి వేదిక డాన్స్.. వీడియో వైరల్

ఈ పాటకు దళపతి విజయ్ తో పాటూ బుట్టబొమ్మ వేసిన స్టెప్పులిప్పుడు ఫుల్ వైరల్ గా మారాయి. షరా మామూలుగా వ్యూస్, లైక్స్ రికార్డ్స్ తో.. హలమితి హబిబో.. ఓ వైపు దుమ్ము రేపుతుంటే.. మరోవైపు ఆడియెన్స్ నుంచి సెలెబ్రిటీస్ వరకు ఈ ట్యూన్ రీల్స్ తో రచ్చ రచ్చ చేస్తున్నారు. హలమితి హబిబో అంటూ రెచ్చిపోతున్నారు దళపతి ఫ్యాన్స్. కోలీవుడ్ క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుథ్ రవిచంద్రన్ కంపోజ్ చేసిన ఈ పాటకు హీరో శివకార్తికేయన్ లిరిక్స్ అందించడం ఓ స్పెషాలిటీ.

Kalavathi-Arabic Kuthu: మహేష్ 50 మిలియన్.. విజయ్ 100 మిలియన్ వ్యూస్!

రిలీజైన 23 రోజుల్లోనే 150 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. సౌత్ ఇండియాలోనే అత్యంత వేగంగా ఇన్ని వ్యూస్ సాధించిన సాంగ్‌గా అరబిక్ కుతు రికార్డుల్లోకి ఎక్కింది. అంతేకాదు 4.4 మిలియన్ల లైక్స్‌ని కూడా ఈ సాంగ్ సాధించింది. 48 గంటల్లోనే గ్లోబల్ టాప్ సాంగ్స్ లిస్ట్ లో కూడా ప్లేస్ దక్కించుకున్న ఈ పాట సో సేమ్ టైమ్ అటు కామన్ పీపుల్ నుంచి క్రేజీ సెలబ్రిటీస్ వరకు ఈ సాంగ్ రీల్స్ తో సోషల్ మీడియాను హీటెక్కిస్తున్నారు.

Arabic Kuthu: విజయ్ బీస్ట్ పాటకి ఎన్టీఆర్ ‘లవ్ దెబ్బ’ మాస్ స్టెప్పులేస్తే?!