ఫ్యాన్స్ ను టెన్షన్ పెట్టిస్తున్న దేవరకొండ!

  • Publish Date - March 29, 2019 / 10:52 AM IST

టాలీవుడ్ సెన్సేషన్ హీరో విజయ్ దేవరకొండ సినిమా వస్తోందంటే..ఆడియన్స్ లో ఎక్స్ పెక్టేషన్స్ అమాంతం పెరిగిపోతాయి. ముఖ్యంగా యూత్ లో..విజయ్ కి ఓ రేంజ్ లో క్రేజ్ ఉంది. అందుకే విజయ్ సినిమా ఎప్పుడు రిలీజవుతుందా.. మరోసారి రౌడీ యాటిట్యూడ్ ని సిల్వర్ స్క్రీన్ పై ఎప్పుడెప్పుడు చూస్తామా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తారు. గీత గోవిందం తర్వాత విజయ్, రష్మిక మండన్నా కాంబినేషన్ లో.. డియర్ కామ్రెడ్ సినిమా రాబోతుంది. అందుకే సినిమా మీద ఎక్స్ పెక్టేషన్స్ ఓ రేంజ్ లో ఉన్నాయి. రీసెంట్ గా రిలీజైన డియర్ కామ్రెడ్ టీజర్ కి ఓ రేంజ్ లో రెస్పాన్స్ రావడంతో అంచనాలు మరింత పెరిగిపోయాయి.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో డియర్ కామ్రెడ్ షూటింగ్ జరుగుతున్న టైంలోనే డైరెక్టర్ భరత్ కమ్మ తండ్రి మరణించారు. దీంతో.. షూటింగ్ మధ్యలో గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ లో విజయ్ దేవరకొండ క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న మరో సినిమా షూటింగ్ లో పాల్గొన్నాడు. సో.. షూటింగ్ కి గ్యాప్ రావడంతో సినిమా అనుకున్న టైంకి పూర్తయ్యే అవకాశం లేనట్లు తెలుస్తోంది.

డియర్ కామ్రెడ్ రిలీజ్ మే 31 నుంచి జూన్ సెకెండ్ వీక్ కి పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి నిజంగానే రిలీజ్ వాయిదా పడుతుందో లేకపోతే కామ్రెడ్ పట్టుదలతో పనిచేసి.. అనుకున్న టైంకే వస్తాడో చూడాలి.