Vijay Devarakonda : తెరపైకి మరోసారి గీత గోవిందం కాంబినేషన్..

టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండకి లైఫ్ ఇచ్చిన సినిమా అర్జున్ రెడ్డి అయినా, అతనిని స్టార్ హీరోల సరసన చేర్చిన సినిమా మాత్రం 'గీత గోవిందం'. తాజాగా విజయ్ దేవరకొండ మరోసారి దర్శకుడు పరశురామ్ తో చేతులు కలపబోతున్నాడు.

Vijay Devarakonda

Vijay Devarakonda : టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండకి లైఫ్ ఇచ్చిన సినిమా అర్జున్ రెడ్డి అయినా, అతనిని స్టార్ హీరోల సరసన చేర్చిన సినిమా మాత్రం ‘గీత గోవిందం’. 2018లో కేవలం రూ.5 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రూ.130 కోట్లకు పైగా కలెక్ట్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ కామెడీ ఫిలింలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. విజయ్, రష్మిక మధ్య కెమిస్ట్రీ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. తాజాగా విజయ్ దేవరకొండ మరోసారి దర్శకుడు పరశురామ్ తో చేతులు కలపబోతున్నాడు.

Vijay Devarakonda : మొత్తానికి బయటకొచ్చిన రౌడీ స్టార్.. ఆగిపోయిన ఖుషి పనులు మొదలు..

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ దిల్ రాజు నిన్న విజయ్, పరశురామ్ తో ఉన్న ఫోటోని షేర్ చేశాడు. సినిమాకి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ఇస్తాము ఎదురు చూస్తూ ఉండండి అంటూ ట్వీట్ చేశాడు. దీంతో విజయ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషిలో ఉన్నారు. ఈ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ మళ్ళీ కలవడంతో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. మరి ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మికని తీసుకుంటారా? లేదా? అనేది చూడాలి.

ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఖుషి సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే సగ భాగం షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ త్వరలోనే తిరిగి సెట్స్ పైకి వెళ్లనుంది. ఇటీవలే సమంత ఆరోగ్యం బాగు అవ్వడంతో, ఆమె తిరిగి షూటింగ్స్ లో పాల్గొంటుంది. ఇక ఈ మూవీతో పాటు జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక సినిమాకి విజయ్ ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. ప్రెజెంట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ మూవీ త్వరలోనే పట్టాలు ఎక్కనుంది. ఈ చిత్రంతో విజయ్ మొదటిసారిగా పోలీస్ పాత్రలో కనిపించబోతున్నాడు.