టాలివుడ్ రౌడీ విజయ్ దేవరకొండలో ఆడియన్స్ కి ఎక్కువగా నచ్చే విషయం యాటిట్యూడ్ రఫ్ అండ్ టఫ్ టాకింగ్ సినిమాల్లోనే కాదు పబ్లిక్ ఈవెంట్స్ లో కూడా విజయ్ వే ఆఫ్ టాకింగ్ అలాగే ఉంటుంది. తెలుగు హీరోలంతా ఒకవైపు విజయ్ దేవరకొండ ఒక్కడు ఒకవైపు. ఆ యాటిట్యూడ్ ఆ స్టైల్ మరే హీరోకి రాదు. అందుకే చేసింది కొన్ని సినిమాలే అయినా యూత్ లో విజయ్ దేవరకొండకి స్టార్ హీరోలకున్నంత క్రేజ్ ఉంది.
యాక్టింగ్ నుంచి స్టైల్ వరకు తనకంటూ సొంత బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు విజయ్. లేటెస్ట్ గా మహర్షి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విజయ్ స్పీచ్ ఆకట్టుకుంది. ఒక అభిమానిగా మహేశ్ బాబుని సార్ అని అనిపిలవడం ఇబ్బందిగా ఉందన్నాడు విజయ్. అంతేకాదు హీరోగా మారకముందు మహేశ్ సినిమా టికెట్స్ కోసం థియేటర్స్ దెగ్గర ఎన్ని ఇబ్బందులు పడ్డాడో చెప్పి అభిమానుల్ని అట్రాక్ట్ చేశాడు.
ఎదుటివారిని బుట్టలో వేసుకోవడంలో విజయ్ దేవరకొండ తర్వాతే ఎవరైనా. మాటలతోనే మాయ చేసేస్తాడు. కేవలం సినిమాల విషయంలోనే కాదు డ్రెస్సింగ్ స్టైల్స్ వే ఆఫ్ వాకింగ్ అన్నింట్లోనూ విజయ్ స్టైలే వేరు. సినిమా ప్రమోషన్స్ కి వెరైటీ వెరైటీ డ్రెస్సింగ్ స్టైల్స్ లో వచ్చి స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నాడు. బాలివుడ్ లో హీరో రణ్ వీర్ సింగ్ ఎలాగో టాలివుడ్ లో విజయ్ దేవరకొండ అలా మారిపోయాడు.