Vijay Devarakonda: ఆ పాత్ర చేయడం తన డ్రీమ్ అంటోన్న రౌడీ స్టార్!
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ రీసెంట్ మూవీ ‘లైగర్’ బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు పూరీ జగన్నాధ్ తెరకెక్కించగా, ఈ సినిమాలో మిక్సిడ్ మార్షల్ ఆర్ట్స్ ప్లేయర్‌గా విజయ్ దేవరకొండ నటించాడు. ఇక ఈ సినిమా ఫెయిల్యూర్‌ను పక్కనబెట్టి, ప్రస్తుతం తన నెక్ట్స్ చిత్రంపై ఫోకస్ పెట్టాడు ఈ స్టార్ హీరో.

Vijay Devarakonda Dream Of Doing This Role
Vijay Devarakonda: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ రీసెంట్ మూవీ ‘లైగర్’ బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు పూరీ జగన్నాధ్ తెరకెక్కించగా, ఈ సినిమాలో మిక్సిడ్ మార్షల్ ఆర్ట్స్ ప్లేయర్‌గా విజయ్ దేవరకొండ నటించాడు. ఇక ఈ సినిమా ఫెయిల్యూర్‌ను పక్కనబెట్టి, ప్రస్తుతం తన నెక్ట్స్ చిత్రంపై ఫోకస్ పెట్టాడు ఈ స్టార్ హీరో.
Vijay Devarakonda: ఆ యంగ్ డైరెక్టర్‌కు ఓకే చెప్పేసిన విజయ్ దేవరకొండ..?
మరోసారి పూరీ జగన్నాధ్ డైరెక్షన్‌లో ‘జనగణమన’ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు ఈ హీరో. ఇక ప్రస్తుతం ‘జై జవాన్’ అనే ప్రోగ్రాం చేస్తున్న ఈ హీరో ఇటీవల కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ విజయ్ దేవరకొండ తన డ్రీమ్ రోల్ ఏమిటో చెప్పేశాడు. హాలీవుడ్‌లో తెరకెక్కిన ‘ది గ్లాడియేటర్’ పాత్ర తనకు డ్రీమ్ రోల్ అని విజయ్ చెప్పుకొచ్చాడు. అంతేగాక, తనకు పాములంటే చాలా భయం అని.. అలాగే తాను చిన్నప్పుడు బస్సు డ్రైవర్, పోలీస్, క్రికెటర్, యాక్టర్ కావాలని కోరుకున్నట్లుగా తెలిపాడు.
ఇలా తన మనసులోని మాటలను బయటపెట్టిన విజయ్ దేవరకొండ గ్లాడియేటర్ లాంటి పాత్ర పడితే చేస్తారా అని ఆయన అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. మరి నిజంగానే అలాంటి కథ వస్తే, విజయ్ దేవరకొండ ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తాడా అని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.