Pushpaka Vimanam: తమ్ముడి కోసం రౌడీ ఆరాటం.. పుష్పక విమానంతో తీరేనా?
ఈ శుక్రవారం ఎన్ని సినిమాలు ధియేటర్లోకొస్తున్నా.. అందరి కాన్సన్ ట్రేషన్ మొత్తం పుష్పకవిమానం మీదే. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న సినిమా కావడంతో పాటు..
- Naresh Mannam
- Published on- November 12, 2021 / 03:48 PM IST
Pushpaka Vimanam
Pushpaka Vimanam: ఈ శుక్రవారం ఎన్ని సినిమాలు ధియేటర్లోకొస్తున్నా.. అందరి కాన్సన్ ట్రేషన్ మొత్తం పుష్పకవిమానం మీదే. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న సినిమా కావడంతో పాటు.. విజయ్ ఈ సినిమాని ప్రొడ్యూస్ చెయ్యడంతో సినిమా మీద ఇంకా ఇంట్రస్ట్ పెరిగిపోయింది అందరికీ. ఈ సినిమాలో చాలా స్పెషాలిటీస్ ఉన్నాయని పుష్పక విమానం టీమ్ ధీమాగా చెప్తుంది.
RRR: యూట్యూబ్‌కి కూడా అందని మన హీరోల ‘నాటు’ డాన్స్ స్పీడ్!
విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా విజయ్ దేవరకొండ ప్రొడ్యూసర్ గా తెరకెక్కిన సినిమా పుష్పకవిమానం. సృజన్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇస్తున్న ఈ సినిమా నవంబర్ 12న ధియేటర్లోకి వస్తోంది. ఈ వీకెండ్ కి ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నా.. అందరూ పుష్పకవిమానం మీదే ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. లాస్ట్ టైమ్ మిడిల్ క్లాస్ మెలొడీస్ తో ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేసిన ఆనంద్ ఈ సారి పుష్పకవిమానంతో కూడా ఇదే ఫార్ములాతో వస్తున్నాడు.
Chiranjeevi: బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో మెగాస్టార్ దూకుడు!
విజయ్ ప్రొడ్యూస్ చేస్తున్నాడనే కాకుండా సినిమా లైన్ కూడా అంతే ఇంట్రస్టింగ్ గాకనిపిస్తోంది. గవర్నమెంట్ టీచర్ గా పనిచేస్తున్న ఆనంద్ పెళ్లి చేసుకున్న వారానికే వాళ్లావిడ ఇంట్లోనుంచి వెళ్లిపోయిన తర్వాత.. ఆనంద్ పడే ఇబ్బందులు, అసలు భార్య ఇంట్లోనుంచి ఎందుకు వెళ్లిపోయింది..? అనే ఇంట్రస్టింగ్ టాపిక్ తో తెరకెక్కింది పుష్పకవిమానం సినిమా.
RRR: బామ్మ ‘నాటు’ డాన్స్.. కేకో కేక..!
పుష్పకవిమానం అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించారు. శాన్వి, గీత సైనితో పాటు సునీల్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమా 100 పర్సెంట్ ఫన్ రైడ్ అని ఫస్ట్ నుంచి టీజర్స్, ట్రైలర్స్ లోనే ప్రామిస్ చేశారు టీమ్. అంతేకాదు పుష్పకవిమానం సినిమాని ఫస్ట్ నుంచి పీక్స్ లో ప్రమోట్ చేస్తున్న విజయ్ దేవరకొండ కూడా సినిమా మీద ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అంతేకాదు.. ఫ్యాన్స్ తో కలిసి ప్రీమియర్స్ కూడా ప్లాన్ చేశారు విజయ్ దేవరకొండ. మరి తమ్ముడి కోసం విజయ్ ఆరాటం ఈ సినిమాతో అయినా తీరుతుందో లేదో.
