Vijay Devarakonda next movie shooting update
Vijay Devarakonda : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో రౌడీ హీరోగా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయగా ముగింపు దశకు చేరుకుంది. అయితే ఈ సినిమా పూర్తి కాకముందే మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ఈ రౌడీ హీరో.
శ్యామ్ సింగ రాయ్ ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో ఓ సరికొత్త సినిమా చెయ్యడానికి రెడీ గా ఉన్నాడు విజయ్ దేవరకొండ. ఇప్పటికే దీనికి సంబందించిన అధికారిక ప్రకటన కూడా చేసాడు. కాగా ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల దశలో ఉన్న ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో స్టార్ట్ చేస్తారట.
Also Read : Chinni Krishna : ప్రముఖ సినీ రచయిత చిన్ని కృష్ణ ఇంట తీవ్ర విషాదం..
అయితే ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ భారీ కసరత్తులే చేస్తునట్టు తెలుస్తుంది. ఈ సినిమాకోసం ప్రత్యేకంగా గుర్రపు స్వారీ నేర్చుకున్నట్టు తెలుస్తుంది. ఇకపోతే ఈ సినిమాలో విజయ్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.