Site icon 10TV Telugu

Vijay Devarakonda: రౌడీ స్టార్ కూడా అదే బాటలో.. VD12 సరికొత్త కాన్సెప్ట్ పోస్టర్!

Vijay Devarakonda Next Movie With Gowthm Tinnanuri Announced

Vijay Devarakonda Next Movie With Gowthm Tinnanuri Announced

Vijay Devarakonda: టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలతో బాక్సాఫీస్ వద్ద దూకుడు చూపిస్తున్నాడు. ఇప్పటికే శివ నిర్వాణ దర్శకత్వంలో ‘ఖుషి’ మూవీలో నటిస్తున్న విజయ్ దేవరకొండ, ఈ సినిమాలో స్టార్ బ్యూటీ సమంతతో రొమాన్స్ చేస్తున్నాడు. ఈ సినిమాలో విజయ్ పాత్ర సరికొత్తగా ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

Vijay Devarakonda: గ్లోబల్ స్టార్‌కు రౌడీ స్టార్ థ్యాంక్స్.. ఎందుకంటే..?

కాగా, నేడు విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ అభిమానులు సోషల్ మీడియాలో దుమ్ములేపుతున్నారు. ఇక ఈ హీరో కూడా తన బర్త్‌డే సందర్భంగా తన సినిమాలకు సంబంధించి వరుస అప్డేట్స్ వదులుతూ అభిమానుల్లో ఆసక్తిని క్రియేట్ చేస్తున్నాడు. ఖుషి మూవీ నుండి ఓ లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేసిన రౌడీ స్టార్ తన కెరీర్‌లోని 12వ చిత్రానికి సంబంధించిన అప్డేట్‌ను కూడా అనౌన్స్ చేశాడు. జెర్సీ మూవీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ 12వ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించింది.

Vijay devarakonda : బర్త్ డే బాయ్ విజయ్ దేవరకొండ.. ఈ సారైనా హిట్ కొడతాడా?

ఈ మూవీ ఓ వైవిధ్యమైన స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీగా రాబోతున్నట్లు ఓ ప్రీ-లుక్ పోస్టర్‌లో రివీల్ చేశారు. ఇక ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ-సాయి సౌజన్యలు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ చిత్రానికి యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ మూవీ అనౌన్స్‌మెంట్‌తో ప్రేక్షకుల్లో అప్పుడే పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది.

Exit mobile version