Prabhas : ప్రభాస్ ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టారా? నేషనల్ మీడియాకు గట్టి సమాధానం ఇచ్చిన మారుతి..

తాజాగా ప్రభాస్ రాజాసాబ్ సినిమా రిలీజ్ కి ముందు ప్రెస్ మీట్ నిర్వహించారు. (Prabhas)

Prabhas : ప్రభాస్ ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టారా? నేషనల్ మీడియాకు గట్టి సమాధానం ఇచ్చిన మారుతి..

Prabhas

Updated On : January 8, 2026 / 9:22 AM IST
  • ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ట్యాగ్ వివాదం
  • ప్రశ్నించిన నేషనల్ మీడియా
  • సమాధానం ఇచ్చిన మారుతి

Prabhas : ప్రభాస్ బాహుబలి సినిమాతోనే పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఆయనకు దేశమంతా అభిమానులు ఏర్పడ్డారు. బాహుబలి, ఆ తర్వాత సినిమాలతో వేరే దేశాల్లో కూడా ప్రభాస్ కి ఫ్యాన్స్ అయ్యారు. ప్రభాస్ తర్వాతే ఇప్పుడు అంతా పాన్ ఇండియా హీరో అనే క్రేజ్ కోసం తాపత్రయపడుతున్నారు.(Prabhas)

గతంలో ప్రభాస్ కి రెబల్ స్టార్ అని వేసేవాళ్ళు. ఇటీవల సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ సినిమా అనౌన్స్ చేసినప్పుడు ప్రభాస్ ని ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని ట్యాగ్ వేసాడు. దీంతో ఈ ట్యాగ్ కాస్త వైరల్ అయింది. ఫ్యాన్స్ కి నచ్చేసింది. అయితే బాలీవుడ్ వాళ్ళు మన టాలీవుడ్ ఎదుగుదలపై ఎప్పుడూ కామెంట్స్ చేస్తూనే ఉంటారుగా.

Also See : Amala Paul : సంక్రాంతి స్పెషల్.. కొడుకుతో అమలాపాల్ క్యూట్ ఫొటోలు..

ప్రభాస్ కి ఆ ట్యాగ్ ఇవ్వడంతో ఓ డైరెక్టర్ ఆల్రెడీ షారుఖ్ కి కింగ్, బాలీవుడ్ బాద్షా ఉన్నా ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అంటూ ప్రభాస్ కి కౌంటర్ గా ట్వీట్ చేయడంతో ఇది పెద్ద రచ్చే అయింది. సోషల్ మీడియాలో షారుఖ్, ప్రభాస్ ఫ్యాన్స్ తెగ తిట్టుకున్నారు.

తాజాగా ప్రభాస్ రాజాసాబ్ సినిమా రిలీజ్ కి ముందు ప్రెస్ మీట్ నిర్వహించారు. హైదరాబాద్ లో నిర్వహించిన ఈ ప్రెస్ మీట్ కి అన్ని భాషల నుంచి, బాలీవుడ్ నుంచి కూడా మీడియా వాళ్ళు వచ్చారు. మీడియాతో మూవీ టీమ్ మాట్లాడారు.

Also See : Rajasaab Press Meet : ప్రభాస్ లేకుండానే.. రాజాసాబ్ రిలీజ్ ప్రెస్ మీట్.. ఫోటోలు..

ఈ క్రమంలో ఓ మీడియా ప్రతినిధి.. రీసెంట్ గా సందీప్ రెడ్డి వంగ కూడా ప్రభాస్ తో సినిమా మొదలుపెట్టాడు. ఆయన తన సినిమాలో ప్రభాస్ ని ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని చూపించారు. సౌత్ లో, వేరే భాషల్లో చాలా మంది స్టార్స్ ఉన్నారు. ప్రభాస్ మాత్రమే ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని మీరు అనుకుంటున్నారా అని ప్రశ్నించారు.

దీనికి డైరెక్టర్ మారుతి సమాధానమిస్తూ.. నేను ఆయన గ్లోబల్ స్టార్ అని ఫీల్ అవుతున్నాను. ఆయన కేవలం పాన్ ఇండియా మాత్రమే కాదు పాన్ వరల్డ్ హీరో. పాన్ వరల్డ్ ఆయన సినిమాలు చూస్తున్నారు. జపాన్ కి కూడా ఆయన వెళ్ళినప్పుడు అక్కడ స్పందన మీరు చూసారుగా. ఆయన మనసు, మంచితనం అలాంటిది అని సమాధానం ఇచ్చారు. వాళ్ళు పాన్ ఇండియా హీరో అనుకుంటే మారుతి ఏకంగా పాన్ వరల్డ్ హీరో అని కౌంటర్ ఇవ్వడంతో ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి.

Also Read : Rajasaab Movie : ప్రభాస్ సినిమాకు థియేటర్స్ ఇష్యూ..? థియేటర్స్ ఇవ్వకపోతే.. SKN స్పీచ్ వైరల్..