Sanjana Galrani : నా సపోర్ట్ శివాజీకే.. చీరలు కట్టుకోండి.. పొట్టి బట్టలు వేసే హీరోయిన్స్ కి కౌంటర్ ఇచ్చిన బిగ్ బాస్ సంజన..
బిగ్ బాస్ తెలుగులో మెప్పించిన సంజన గల్రాని ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో శివాజీకి సపోర్ట్ గా మాట్లాడుతూ పొట్టి బట్టలు వేసే హీరోయిన్స్ కి సలహాలు, సూచనలు ఇచ్చింది.(Sanjana Galrani)
Sanjana Galrani
- శివాజీ కామెంట్స్ ఇష్యూ
- శివాజీకి సపోర్ట్ చేసిన సంజన
- సంజన గల్రాని కామెంట్స్ వైరల్
Sanjana Galrani : ఇటీవల నటుడు శివాజీ హీరోయిన్స్ చీరలు కట్టుకోండి, మంచి బట్టలు వేసుకోండి అని ఓ ఈవెంట్లో చెప్పారు. అయితే అనుకోకుండా ఓ రెండు తప్పుడు పదాలు వాడటంతో మంచి విషయం చెప్పినా కొంతమంది శివాజీని టార్గెట్ చేసి విమర్శలు చేసారు. దీంతో ఇది పెద్ద గొడవ అయింది. శివాజీ కామెంట్స్ మీద చర్చ ఇంకా నడుస్తూనే ఉంది.(Sanjana Galrani)
కొంతమంది సినిమా మహిళా సెలబ్రిటీలు తప్ప అందరూ శివాజీకి సపోర్ట్ చేస్తున్నారు. సోషల్ మీడియా, జనాలు, సాధారణ మహిళలు కూడా శివాజీకి సపోర్ట్ చేస్తూ మాట్లాడిన వీడియోలు వైరల్ అయ్యాయి. తాజాగా నటి, ఇటీవలే బిగ్ బాస్ తెలుగులో మెప్పించిన సంజన గల్రాని ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో శివాజీకి సపోర్ట్ గా మాట్లాడుతూ పొట్టి బట్టలు వేసే హీరోయిన్స్ కి సలహాలు, సూచనలు ఇచ్చింది.
Also Read : Prabhas : ప్రభాస్ ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టారా? నేషనల్ మీడియాకు గట్టి సమాధానం ఇచ్చిన మారుతి..
Sanjana Galrani
సంజన గల్రాని మాట్లాడుతూ.. నేను యంగ్ గా ఉన్నప్పుడు గ్లామరస్ డ్రెస్ లు వేసుకున్నా. అపుడు లైఫ్ మీద నాకు తక్కువ నాలెడ్జ్ ఉంది. నేను కూడా శివాజీ గారి కామెంట్స్ చూసాను. ఆ రచ్చ అంతా తెలుసు. నేను శివాజీ గారికే సపోర్ట్ చేస్తాను. నేను ఇండియన్ చీరలు, డ్రెస్ లు కట్టుకోవడంలో గర్వంగా ఫీల్ అవుతాను. నేను గ్లామర్ సినిమాలు కూడా చేసాను. నన్ను ఎవరైనా ఇలాంటి సినిమాలు చేయొద్దు అని, ఇలాంటివి చేయాలని చెప్తే, గైడ్ చేస్తే బాగుండేది అనిపించింది.
మీరు నమ్ముతారో లేదో నేను కొన్ని వెబ్ సైట్స్ కి ఫోన్ చేసి నా పాత ఫొటోలు డిలీట్ చేయమని అడిగాను. నన్ను ఇంట్లో ఎవరూ అడగరు కానీ నాకే అనిపిస్తుంది. గతంలో కొన్ని సినిమాల్లో అనవసరంగా షార్ట్ డ్రెస్ లు వేసుకున్నాను, అనవసరంగా ఇలాంటి ఫొటోలు దిగాను, ఇంట్లో నాకు ఇలాంటివి చెప్పలేదు, వీటి మీద గైడ్ చేస్తే బాగుండేది కదా అనుకున్నాను. అలాంటి బట్టలు వేసుకున్నందుకు రిగ్రెట్ ఫీల్ అయ్యాను. డబ్బుల కోసం కొన్ని సినిమాలు చేశాను.
ఇప్పుడు వచ్చే హీరోయిన్స్ ఈ సినిమా చేయకపోతే కెరీర్ పోతుంది అని చిన్న డ్రెస్ లు వేసుకోవడం, ఓవర్ గ్లామర్ గా చేయడం చేయకండి. గ్లామర్ ఓకే కానీ ఓవర్ గ్లామర్ చేయకండి. చీరలు కట్టుకోండి, జీన్స్, డ్రెస్ లు వేసుకోండి కానీ మంచి బట్టలు వేసుకోండి. మీకు డ్రెస్సింగ్ గురించి ఇప్పుడు అర్ధం అవ్వదు మీకు పెళ్లయి, కూతురు ఉంటే తెలుస్తుంది. అలాంటి బట్టలు వేసి చేసే ప్రాజెక్ట్స్ చేసిన తర్వాత మీ పిల్లలు, భర్తతో కలిసి చూడగలనా లేదా అని ఆలోచించండి. నాకు ఆ సమయంలో చెప్పేవాళ్ళు లేరు. నాకు ఆ బాధ తెలుసు అని చెప్పింది. దీంతో సంజన కామెంట్స్ వైరల్ గా మారాయి.
Also Read : Thaman : రాజాసాబ్ సాంగ్ విషయంలో ఫీల్ అయ్యాను.. తమన్ కామెంట్స్ వైరల్..
