Vijay devarakonda Rashmika Mandanna maldive Tour
Vijay-Rashmika: గీతగోవిందం సినిమాతో లవ్లీ పెయిర్ గా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ, రష్మిక మందన ప్రేమలో ఉన్నారంటూ ఎప్పటినుంచో కథనాలు వినిపిస్తున్నాయి. గీతగోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల్లో నటించిన వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడడంతో, అది కాస్త ప్రేమగా మారిందంటూ గత కొంతకాలంగా వింటూనే వస్తున్నాం.
Vijay Devarakonda : దాని గురించి ఇక్కడెందుకు.. వేడుకల్ని ఎంజాయ్ చేయండి..
ప్రస్తుతం వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నట్లు గట్టిగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ జంట మాల్దీవులకు పయనమయినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. శుక్రవారం ఉదయం ముంబై ఎయిర్ పోర్టులో రష్మిక మందన కనిపించగా, మరికాసేపటికే రౌడీ బాయ్ విజయ దేవరకొండ కూడా దర్శనమిచ్చాడు.
దీంతో విజయ్-రష్మిక మాల్దీవుల టూర్ కి వెళుతున్నారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ వార్తలో నిజమెంత వరకు ఉందో తెలియదు. ఇటీవల రష్మిక కూడా విజయ్ నటించిన ‘లైగర్’ సినిమా తనకెంతో నచ్చిందంటూ, మూవీని విజుల్స్ వేస్తూ మరి చూశానంటూ మీడియాకు చెప్పిన సంగతి తెలిసిందే.