Site icon 10TV Telugu

Vijay Devarakonda Samantha : ఖుషి ఆడియో లాంచ్.. విజయ్, సమంతలపై దారుణంగా ట్రోల్స్..

Vijay Devarakonda Samantha Dance in Kushi Audio Launch Trolls in Social media

Vijay Devarakonda Samantha Dance in Kushi Audio Launch Trolls in Social media

Vijay Devarakonda Samantha :  విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), సమంత (Samantha) జంటగా శివ నిర్వాణ(Shiva Nirvana) దర్శకత్వంలో లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న సినిమా ఖుషి. ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన కొన్ని పాటలు, ట్రైలర్ ఆడియన్స్ ని మెప్పించాయి. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తుండగా మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ హేశం అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నాడు. ఖుషి సినిమా సెప్టెంబర్ 1న పాన్ ఇండియా రిలీజ్ కాబోతుంది.

ఖుషి చిత్రయూనిట్ ఇటీవల ప్రమోషన్స్ మొదలుపెట్టారు. తాజాగా ఆగస్టు 15న ఇండిపెండెన్స్ డే స్పెషల్ గా హైదరాబాద్ HICC కన్వెన్షన్ లో సాయంత్రం 6 గంటల నుంచి ఆడియో లాంచ్ పేరుతో ఓ మ్యూజికల్ కాన్సర్ట్ ని నిర్వహించారు చిత్రయూనిట్. ఖుషి సినిమా సాంగ్స్ ని లైవ్ లో పర్ఫార్మ్ చేశారు. ఖుషి మ్యూజికల్ కాన్సర్ట్ లో మ్యూజిక్ డైరెక్టర్ హేశం అబ్దుల్ వహిబ్, సిద్ శ్రీరామ్, జావేద్ అలీ, అనురాగ్ కులకర్ణి, హరిచారం, చిన్మయి లైవ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు.

అయితే ఈ ఈవెంట్ లో ఖుషి సాంగ్స్ కి విజయ్ దేవరకొండ, సమంత కలిసి స్టేజి మీద డ్యాన్స్ వేశారు. చాలా ఈవెంట్స్ లో చాలా మంది హీరో హీరోయిన్స్ డ్యాన్సులు వేశారు. కానీ ఖుషి ఈవెంట్ లో విజయ్ షర్ట్ తీసేసి సమంతని ఎత్తుకొని చుట్టూ తిప్పుతూ హడావిడి చేస్తూ డ్యాన్స్ చేయడంతో ఈ వీడియోలు, ఫొటోలు వైరల్ గా మారాయి. హీరో హీరోయిన్స్ లా కాకుండా ఈవెంట్స్ కి డ్యాన్స్ లు వేసే డ్యాన్సర్లులా చేశారని, డ్యాన్స్ చేయడానికి విజయ్ షర్ట్ ఎందుకు ఇప్పడం అని, ఇది మ్యూజికల్ కాన్సర్టా లేక ప్రీ వెడ్డింగ్ షూటా అని, వాళ్ళ డ్రెస్సింగ్ పై కూడా నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. సమంత అభిమానులు కూడా సమంత ఇలా చేస్తుంది అనుకోలేదు అని కామెంట్స్ చేస్తున్నారు.

 

Vishwak Sen : ఫ్యామిలీ ధమాకా.. దాస్ కా ఇలాకా.. టాలీవుడ్ ఫ్యామిలీస్‌తో విశ్వక్ సేన్ ఆట..

ఇక సోషల్ మీడియాలో అయితే వీరిద్దరిపై మీమ్స్, ట్రోల్స్ దారుణంగా వస్తున్నాయి. ఇటీవలే విజయ్ దేవరకొండ మారిపోయాడు, గతంలా హడావిడి చెయ్యట్లేదు అని అంతా అనుకున్నారు. మళ్ళీ ఈ ఖుషి ఆడియో లాంచ్ చూశాకా విజయ్ ఏమి మారలేదు, కాస్త గ్యాప్ ఇచ్చాడు అంతే అని అనుకుంటున్నారు. మరో పక్క చైతన్య ఫ్యాన్స్ కూడా ఈ డ్యాన్స్ చూశాకా ఒక్కసారన్నా చైతూతో ఈ రేంజ్ లో చేశావా అంటూ సమంతపై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. విజయ్, సమంత డ్యాన్స్, ఫొటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

Exit mobile version