Vishwak Sen : ఫ్యామిలీ ధమాకా.. దాస్ కా ఇలాకా.. టాలీవుడ్ ఫ్యామిలీస్‌తో విశ్వక్ సేన్ ఆట..

ఆహాలో విశ్వక్ సేన్ కొత్త షో. 'ఫ్యామిలీ ధమాకా' ఇది మాస్ కా దాస్ ఇలాకా అంటూ టాలీవుడ్ ఫ్యామిలీస్ ని ఒక ఆట ఆడించేందుకు రెడీ అవుతున్నాడు.

Vishwak Sen : ఫ్యామిలీ ధమాకా.. దాస్ కా ఇలాకా.. టాలీవుడ్ ఫ్యామిలీస్‌తో విశ్వక్ సేన్ ఆట..

Vishwak Sen new show Family Dhamaka ready to premier in aha

Updated On : August 15, 2023 / 8:41 PM IST

Vishwak Sen : మాస్ కా దాస్ విశ్వక్ సేన్ యాక్టర్ గానే కాకుండా దర్శకుడిగా కూడా ఆడియన్స్ ని అలరిస్తూ వస్తున్నాడు. ఇప్పుడు హోస్ట్ గా మరో కొత్త అవతారం కూడా ఎత్తాడు. రెండు రోజులు క్రితం ఈ హీరో తన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వేశాడు. “నా జీవితంలోని మరో ఘటాన్ని నేను ప్రారభించబోతున్నాను. నేను కుటుంబాన్ని స్టార్ట్ చేస్తున్నా” అంటూ ఒక గ్రీటింగ్ కార్డుతో పోస్ట్ వేశాడు. ఇక ఇది చూసిన ప్రతి ఒక్కరు విశ్వక్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు అని అందుకున్నారు.

Nayak : రామ్ చరణ్ ‘నాయక్’ సినిమా రీ రిలీజ్‌కి డేట్ ఫిక్స్.. ఎప్పుడో తెలుసా..?

కానీ విశ్వక్ మాత్రం అందరి అంచనాలకు అందకుండా పెద్ద సర్‌ప్రైజే ఇచ్చాడు. తెలుగు బిగ్గెస్ట్ ఓటీటీ ఆహాలో (Aha) మొదలు కాబోతున్న ఒక సరికొత్త షోకి విశ్వక్ హోస్ట్ గా చేయబోతున్నాడు. ‘ఫ్యామిలీ ధమాకా’ (Family Dhamaka) అనే టైటిల్ తో రాబోతున్న ఈ షోలో టాలీవుడ్ లోని పలు సెలబ్రెటీ ఫ్యామిలీస్ ని తీసుకొచ్చి విశ్వక్ ఒక ఆట ఆడించబోతున్నాడు. కాగా ఆహాలో ఇప్పటి వరకు ఎన్ని షోలు వచ్చినా బాలయ్య అన్‌స్టాపబుల్ మ్యానియాని మాత్రం డామినేట్ చేయలేకపోయాయి. మరి ఈ మాస్ కా దాస్ ఇలాకా అన్‌స్టాపబుల్ ని డామినేట్ చేస్తుందా లేదా చూడాలి.

Leo Movie : లియో నుంచి అర్జున్ ప్రోమో రిలీజ్.. రోలెక్స్ ఎంట్రీ రేంజ్‌లో హారొల్ద్ దాస్ ఎంట్రీ..

 

View this post on Instagram

 

A post shared by Vishwak Sen (@vishwaksens)

ఈ షో ఎప్పటి నుంచి మొదలు కాబోతుందో అనేది ప్రస్తుతం తెలియజేయలేదు. ఇక విశ్వక్ సేన్ సినిమాలు విషయానికి వస్తే.. ప్రస్తుతం గామి, VS10, VS11 మూడు సినిమాలు చేస్తున్నాడు. వీటిలో గామి షూటింగ్ పూర్తి అయ్యిపోయి పోస్టు ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న VS11.. షూటింగ్ అప్డేట్స్ తో పాటు ప్రమోషన్స్ లో కూడా ఫుల్ జోష్ మీద ఉంది. ఇక కొత్త దర్శకుడు రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న VS10 అప్డేట్ మాత్రం ఏమి తెలియడం లేదు.